end

Covid:తొలి ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్‍కు ఆమోదం

  • ప్రపంచంలోనే మొదటి టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్


కోవిద్ (COVID) నియంత్రణలో భాగంగా బూస్టర్ డోస్‌ (Booster dose)గా ఉపయోగించేందుకు ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇన్‍కోవాక్‌ (Intranasal covid vaccine Incovac) కు ఆమోదం లభించింది. ప్రాథమిక సిరీస్, హెటిరోలాగస్ బూస్టర్‌గా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSO) నుంచి ఈ నాసికా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించింది. ప్రాథమిక సిరీస్, హెటిరోలాగస్ బూస్టర్‌గా అప్రూవల్స్ పొందిన తొలి ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ ఇదే. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ ఇన్‍కోవాక్ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍ను తయారు చేసింది. వాషింగ్టన్ యూనివర్సిటీ – సెయింట్ లూయిస్‍తో కలిసి భారత్ బయోటెక్ ఈ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍ను అభివృద్ధి చేసింది. ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను ముక్కు ద్వారా ఇస్తారు. బూస్టర్ డోస్‍గా ఇచ్చేందుకు ఇన్‍కోవాక్‍కు ఆమోదం లభించింది. సిడిఎస్‌సివో నుంచి తమ ఇన్‍కోవాక్‌ (బిబివి 154) ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ ఆమోదం పొందిందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుతం బ్లూస్టర్ డోస్‍గా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకే పరిమితి ఉందని తెలిపింది. 18 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ వయసు వారికే ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. హెటిరోలాగస్ బూస్టర్ డోస్‍గా ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను (Nasal vaccine) ఉపయోగించేందుకు అనుమతి లభించిందని ఆ సంస్థ వెల్లడించింది. అంటే రెండు డోసులు వేరే రకం వ్యాక్సిన్ తీసుకున్నా.. బూస్టర్ డోస్‍గా ఇన్‍కోవాక్‌ నాజిల్ వ్యాక్సిన్‍ను తీసుకోవచ్చు.

ఇన్‍కోవాక్ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍కు మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ (Clinical trials) నిర్వహించింది భారత్ బయోటెక్ (Bharat Biotech). ఈ టీకాతో దుష్పరిణామాలు ఉండవని తేలిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ నాజిల్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని సంస్థ ప్రకటించింది. ఇన్‍కోవాక్ అనేది ప్రైమరీ 2 డోస్ షెడ్యూల్‍, హెటిరోలోగస్ బూస్టర్ డోస్ (Heterologous booster dose) అని భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇది తమకు గొప్ప విజయమని పేర్కొన్నారు. నాజిల్ వ్యాక్సిన్‍ను తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగానికి కూడా ఇది ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‍లకు డిమాండ్ లేదని, అయినా భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షనల్ వ్యాధుల కోసం టెక్నాలజీ సిద్ధంగా ఉందని నిర్దారించుకునేందుకు తాము ఈ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ అభివృద్ధిని కొనసాగించామన్నారు. నిర్దిష్ట కొవిడ్ వేరియంట్‍లకు వ్యాక్సిన్‍లను కూడా భవిష్యత్తు కోసం అభివృద్ధి చేస్తామని కృష్ణ ఎల్లా (Krishna Ella) పేర్కొన్నారు.

(Organ donation:అవయవ దాతలకు డబుల్ బెడ్​రూమ్!)

Exit mobile version