టైమ్ ట్రావెలర్స్ భవిష్యత్తులో (Future) జరగబోయే సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ (interesting) కథనాలను (stories) చెప్పడం వింటూనే ఉన్నాం. కొన్నిసార్లు ఈ ఇమాజినేషన్స్ (imagination) కొంచెం ఓవర్ (over) అయిపోయే సందర్భాలు కూడా చూశాం. ఇలాంటి కోవకు చెందినవే టిక్ టాక్ (Tik Tok)లో ‘@timevoyagin’ పేరుతో ఉన్న టైమ్ ట్రావెలర్ (Time Traveler) ఊహలు కూడా. 2022 చివరి భాగం, 2023 మొదటి భాగంలో జరగబోయే ఐదు క్రూరమైన హెచ్చరికలు జారీ చేసిన ఆయన.. ఇందులో ‘డ్రాగన్స్ డిస్కవరీ’ (Dragons Discovery) గురించి చెప్పడం నెట్టింట చర్చకు దారితీసింది.
(అల్బెలియన్ ప్రభావం..అతి చల్లగా వాతావరణం!)
‘అటెన్షన్ (Attention): నేను రియల్ టైమ్ ట్రావెలర్‌ని. రాబోయే ఈ ఐదు తేదీలు గుర్తుంచుకోండి’ అని.. అక్టోబర్ (October) 2022 నుంచి జనవరి (January) 2023 మధ్య జరగబోయే ఇన్సిడెంట్స్ ( incident) గురించి వీడియోలో హెచ్చరించాడు.
1. అక్టోబర్ 3, 2022: ఐదుగురు టీనేజర్స్ T-Rex ఎగ్‌తో పాటు ఇతర యూనివర్స్‌కు ప్రయాణించే డివైజ్‌ను (devise) కనుగొంటారు.
2. అక్టోబర్ 30, 2022: చాలా పెద్ద UFO భూమిపై ల్యాండ్ (Land) అవుతుంది. ఇందులో గ్రహాంతర జాతులు ఉంటాయి.
3. నవంబర్ 20, 2022: మెక్సికో (Mexico) లోని ఎత్తైన పర్వతాలలో డ్రాగన్స్ కనుగొనబడతాయి.
4. డిసెంబర్ 10, 2022: ఆరోగ్య సమస్యల కారణంగా జో బైడెన్ (Joe Biden) పదవి నుంచి తొలగించబడతాడు. కమలా హారిస్ (Kamala Harris)ఆ పదవిని అధిరోహిస్తారు.
5. జనవరి 1, 2023: ఇండియానాలోని ఇల్లినాయిస్ స్టేట్ (Illinois State) ప్రపంచ ప్రక్షాళనకు దారితీసే మొదటి చట్టాన్ని ఆమోదిస్తుంది.
కాగా ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ (Funny comments) చేస్తున్నారు. అంటే తెరపై కాకుండా నిజజీవితంలో డ్రాగన్ సీక్వెల్ (Dragon) చూడబోతున్నామా అని కామెంట్ చేశారు. ‘ఇంతకీ డ్రాగన్స్ మనతోని సరదాగానే ఉంటాయి కదా.. చంపవు కదా’ అని కొందరు ప్రశ్నిస్తుంటే.. టైమ్ ట్రావెలర్‌గా ఊహించే విషయాలు కనీసం విశ్వసించేలా ఉండేట్లు చూసుకో అని సలహాలిస్తున్నారు.ఇక టైమ్ ట్రావెలర్ ‘@timevoyagin’ ఫ్యూచర్ గురించి చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చనిపోయిప వ్యక్తి మూడు రోజులకు మళ్లీ బతికివస్తాడని.. మరణించాక ఏం జరుగుతుందో చెప్తాడని తెలిపాడు. ‘ఆగస్టు 5, 2022న గుండె సమస్యతో మరణిస్తాడు. కానీ దానిని సర్జన్లు మూడు రోజుల తర్వాత సెట్ చేయగా మళ్లీ బ్రతుకుతాడు’ అని చెప్పాడు.
(Khushi Kapoor: అందాల ఆరబోతలో శ్రీదేవి కూతుళ్లు)