end

Babk of Baroda Jobs : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు

bank of baroda jobs
bank of baroda jobs

Babk of Baroda Jobs : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కాంట్రాక్ట్‌ బేసిస్‌మీద వివిధ పోస్టుల(Contract Jobs) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గుజరాత్‌లోని(Gujrat) వడోదర(Vadodara) బరోడా బ్యాంకులో వెల్త్‌మేనేజ్‌మెంట్‌ (Wealth Management), ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ (Private Banking), సీనియర్‌ మేనేజర్లు (Senior Managers) తదితర పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 546

పోస్టుల వివరాలు:
వెల్త్‌ మేనేజ్‌మెంట్‌–24, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌–17, అక్విజిషన్‌–505.
  • వెల్త్‌ మేనేజ్‌మెంట్‌:
  • ఎన్‌ఆర్‌ఐ వెల్త్‌ ప్రొడక్ట్స్‌ మేనేజర్
  • గ్రూప్‌ సేల్స్‌ హెడ్
  • వెల్త్‌ స్ట్రాటజిస్ట్
  • హెడ్‌ వెల్త్‌–టెక్నాలజీ
  • ప్రొడక్ట్‌ మేనేజర్‌ (ట్రేడ్‌ అండ్‌ ఫారెక్స్‌)
  • ట్రేడ్‌ రెగ్యులేషన్‌ సీనియర్‌ మేనేజర్‌.

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ :
రేడియన్స్‌ ప్రైవేట్‌ సేల్స్‌ హెడ్, ప్రొడక్ట్‌ హెడ్‌–ప్రైవేట్‌ బ్యాంకింగ్, ప్రైవేట్‌ బ్యాంకర్‌.

  • అక్విజిషన్‌:
  • అక్విజిషన్‌ ఆఫీసర్
  • నేషనల్‌ అక్విజషన్‌ హెడ్
  • రీజనల్‌ అక్విజషన్‌ సేల్స్‌ హెడ్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అక్విజషన్‌ పోస్టులకు వయసు 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఇతర పోస్టులకు వయసు 24 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

వేతనం:
అక్విజషన్‌ విభాగం: మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.5 లక్షలు చెల్లిస్తారు. నాన్‌ మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.4 లక్షలు చెల్లిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.03.2023.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

Exit mobile version