end

బండి సంజయ్ ప్రజాయాత్రలో ఘర్షణ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర నల్గొండ, భువనగిరి జిల్లాలు దాటి ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవరుప్పలలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. దీంతో అక్కడున్న కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు చేరుకున్నారు.. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారి తీసింది. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్‌ గూండాలు రాళ్లు రువ్వుతుంటే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పర్మిషన్ తీసుకొని మరీ పాదయాత్ర చేపడుతుంటే తమపై దాడి జరుగుతుందని తెలిసి పోలీసులు చోద్యం చూస్తుండిపోయారని మండిపడ్డారు.

Exit mobile version