end

Burping:నిరంతర తేన్పులతో ప్రాణాంతక వ్యాధి..

పొట్టలో పుండ్లు, మంటకు దారితీస్తున్నట్లు వెల్లడి

దీర్ఘకాలిక రిఫ్లక్స్ సమస్యకు చికిత్స తప్పనిసరి

సాధారణం కంటే ఎక్కువగా తేన్పులతో (burping)బాధపడుతున్నారా? కొంచెం తిన్నా కడుపు (Stomach)నిండుగా అనిపిస్తుందా? అయితే, అది అజీర్ణమైనా లేదా అంతకంటే ప్రమాదకరమైన వ్యాధి అయినా కావచ్చు. వివిధ అధ్యయనాల ప్రకారం.. ఈ పరిస్థితి క్యాన్సర్ (Cancer)వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీయొచ్చు. మామూలుగా త్రేన్పు అనేది నోటి (Mouth) ద్వారా కడుపులోని గాలిని (Air) విడుదల చేసే చర్య. శరీరం జీర్ణవ్యవస్థ (digestive system)కు సరిపడా స్థలాన్ని సర్ధుబాటు చేసే క్రమంలో అదనపు గాలిని వదిలించుకున్నపుడు ఇది జరుగుతుంది. ఇలా విడుదల చేసే గాలిలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ (Oxygen, carbon dioxide, nitrogen) ఉంటాయి. ఇక త్రేన్పులు తరచూ ఉబ్బరం, అసౌకర్యంతో కూడి ఉంటాయని వైద్యులు (Doctors)చెబుతున్నారు.

(Dating:పెళ్లికి ముందు డేటింగ్.. బెస్ట్ ఆప్షన్ కోసమేనా?)

త్రేన్పులకు ప్రధాన కారణాలు :

* చాలా వేగంగా లేదా అతిగా తినడం

* చాలా వేగంగా లేదా అతిగా తాగడం

* కార్బొనేటేడ్ పానీయాలు ఎక్కువగా తాగడం

* ధూమపానం, చూయింగ్ గమ్

సాధారణ కారణాలు :

* ప్రధానంగా పొట్టలో పుండ్లు (sores) పడటం త్రేన్పులకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో అధిక ఆల్కహాల్ (Alcohol)వినియోగంతో కలిగే ఇన్‌ఫెక్షన్ (infection)వల్ల పొట్ట పొరల్లో వాపు లేదా మంట ఏర్పడుతుంది.

* కడుపులోని ఆమ్లం తిరిగి గొంతు (Throat) పైకి ప్రవహించినప్పుడు ఏర్పడే యాసిడ్ రిఫ్లక్స్ (Acid reflux) విపరీతమైన మంటతో కూడిన నొప్పి, గుండెల్లో (Heart) మంటను కలిగిస్తుంది.

* గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిసీజ్ (Gastrointestinal Reflux Disease) ‘GERD’ అనేది త్రేనుపు సమస్యకు మరో కారణం. ఇది దీర్ఘకాలిక రిఫ్లక్స్ సమస్య. చికిత్స చేయకుండా వదిలేస్తే GERD.. అన్నవాహిక (Esophagus) క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

త్రేన్పు వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది?

దీర్ఘకాలికంగా మారే త్రేన్పులు.. క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అధిక త్రేన్పు మాత్రమే క్యాన్సర్‌కు సంకేతం కానప్పటికీ, ఇది H.పైలోరీ ఇన్‌ఫెక్షన్‌తో పాటు అన్నవాహికలో నొప్పి, వాపును కలిగిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే గ్యాస్ట్రిక్ అల్సర్, క్యాన్సర్ (Gastric ulcer, cancer)అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు H. పైలోరీ అత్యంత బలమైన ప్రమాద కారకం అని WebMD చెబుతోంది.

అధిక త్రేన్పుల కారణంగా క్యాన్సర్ సంభవించే ఇతర లక్షణాలు:

* ఆకలి లేకపోవడం బరువు తగ్గడానికి దారితీస్తుంది

* కడుపులో స్థిరమైన నొప్పి, అసౌకర్యం

* ఎప్పుడూ కడుపు నిండిన అనుభూతి

* దీర్ఘకాలికంగా గుండెల్లో మంట, అజీర్ణం

* వికారం, మైకము

* రక్తం వాంతులు

* కడుపులో వాపు

ఈ పరిస్థితులను నిర్ధారించడానికి వైద్యుడు CT స్కాన్, ఎండోస్కోపీ లేదా బేరియం స్వాలో అధ్యయనాన్ని కూడా ఆదేశించవచ్చు.

(Nose Infections:ముక్కులో వేలు పెట్టేవారికి ఆ వ్యాధి లక్షణాలు..)

Exit mobile version