end

Rajnath Singh:భారత్ సూపర్‌పవర్‌గా నిలుస్తోంది

  • 95వ FICCI సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు


కేంద్ర రక్షణ శాఖ మంత్రి (Union Defense Minister)రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) భారతదేశం శక్తి రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిపాడు. అంతేకాదు ప్రపంచ సంక్షేమానికి పాటుపడే సూపర్‌పవర్‌గా నిలవాలని ఇండియా (India) కోరుకుంటోందని అన్నారు. డిసెంబర్ 17న జరిగిన 95వ ఎఫ్ఐసీసీఐ (FICCI) వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra modi)ఎర్రకోట (Red fort))నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి ఐదు వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఈ ఐదు వాగ్దానాలూ దేశాన్ని సూపర్‌పవర్‌ (Super power)గా తీర్చిద్దేందుకు అనివార్యమని అన్నారు. ఇండియా సూపర్‌పవర్‌ కావడం అంటే ఏ ఒక్క దేశంపైనో ఆధిపత్యం కోసం కాదని, ఇతర దేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించుకునే ఉద్దేశం మనకు (భారతదేశానికి) లేదని చెప్పారు. భారత రక్షణ బలగాల (Defense Forces) ధైర్యసాహసాలు ప్రశంసంస్తూ..‘గల్వాన్ (Galvan) కావచ్చు, తవాంగ్ (Tawang) కావచ్చు, మన రక్షణ బలగాలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్నాం:
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (India’s Gross Domestic Product) కంటే చైనా జీడీపీ (GDP) 1949లో చాలా తక్కువగా ఉండేదని, 1980 వరకూ భారతదేశం కనీసం టాప్-10 (Top ten)ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉందన్నారు. ఈరోజు 3.5 ట్రిలియన్ డాలర్ల (trillion dollars) ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఐదవ స్థానానికి చేరుకుందని తెలిపారు.భారత్, చైనా (India and China) సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌ (Tawang)లో ఇరు దేశాల సైనికుల మధ్య ఈనెల 9న ఘర్షణ జరిగిన ప్రాంతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) శనివారంనాడు పర్యటించారు. అనంతరం తవాంగ్ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి ప్రకటించారు. భారత ఆర్మీకి (Army) చెందిన వీర జవాన్లు తగినంత మంది అక్కడ మోహరించినట్టు చెప్పారు. చైనా యుద్ధానికి సన్నద్ధంగా ఉంటే కేంద్రం నిద్రపోతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన ఓ ట్వీట్‌ (Tweet)లో తిప్పికొట్టారు.

తవాంగ్ ఏరియాలో చైనా తెగింపు, కేంద్రం అలసత్వంపై రాహుల్ గాంధీ శుక్రవారంనాడు రాజస్థాన్‌‌ (Rajasthan)లో విమర్శలు గుప్పించారు. చైనా కేవలం చొరబాటులకే పరిమితం కాకుండా యుద్ధానికి సన్నద్ధమవుతోందని, కేంద్ర మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, నిద్రపోతోందని, వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) వెంటనే స్పందించింది. దేశాన్ని తప్పుదారి పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, భారత సైనికుల శౌర్యాన్ని చిన్నబుచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. ఇది 1962 నెహ్రూ (Nehru)ఇండియా కాదని ఎద్దేవా చేసింది.రాహుల్ గాంధీ (Rahul gandhi) కేవలం భారత ఆర్మీనే అవమానించడం లేదు, దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారు. ఆయన కాంగ్రెస్ (Congress) పార్టీకి మాత్రమే సమస్య కాదు, దేశాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాడు. మన సాయుధ బలగాలను చూసి దేశం గర్విస్తోందని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ స్థానికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన ఒక వీడియో (Video)ను కూడా మంత్రి షేర్ చేయగా దేశవ్యాప్తంగా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది రాహుల్‌కు మద్ధతుగా నిలిస్తే మరికొంతమంది బీజేపీ నేతలు దుయ్యబట్టారు.

(Jaipur:రాజస్థాన్‌లో దారుణం)

Exit mobile version