end

ఎంఫిల్‌(MPhil)కు గుర్తింపు లేదు : యూజీసీ

UGC

MPhil Degree : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (University Grants Comission) కీలక హెచ్చరిక చేసింది. ఎంఫిల్‌(Master of Philosophy)కు యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఈ కోర్సులో చేరవద్దని స్పష్టం చేసింది. ఎంఫిల్‌లో అడ్మిషన్‌ల కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చిందని, ఎంఫిల్‌ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంఫిల్‌ అడ్మిషన్లు నిలిపివేయాలని అన్ని విద్యా సంస్థలకు, యూనివర్సిటీలకు యూజీసీ అదేశాలు జారీ చేసింది.

ఎంఫిల్‌(MPhil) ప్రోగ్రామ్‌ను ఉన్నతవిద్యా సంస్థలు అందించరాదని యూజీసీ(UGC) నిబంధనలు 2022 రెగ్యులేషన్‌ నంబర్‌ 14 స్పష్టంగా చెబుతోందని యూజీసీ సెక్రటరీ మనీశ్‌ జోషి సూచించారు. ఎంఫిల్‌లో ప్రవేశాలు నిలిపివేయాలని అందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version