Gold Rate: ఇంట్లో శుభకార్యం అంటే చాలు… మహిళలు ముందుగా గుర్తు చేసుకునేది బంగారు అభరణాలే(Gold ornaments)ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్లు, పండుగలు, నామకరణాలు, గృహప్రవేశాలు వంటి వేడుకల్లో కమ్మలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్, గొలుసులు తప్పనిసరిగా దర్శనమిస్తాయి. డిజైన్ల పరంగా కూడా ఇప్పుడు బంగారు ఆభరణాలు కొత్త కొత్త ట్రెండ్స్‌తో మార్కెట్‌లోకి వస్తుండటంతో లక్షల్లో ఖర్చు పెట్టేందుకు మహిళలు వెనకాడడం లేదు. ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఎప్పుడూ బోర్ కొట్టదన్న మాట నిజమే. ముఖ్యంగా బంగారం కొనుగోలు విషయంలో అయితే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు తరచూ మారుతూ ఉండటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. “ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా?” అంటూ మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కాస్త తగ్గినట్టు అనిపించగానే బంగారం షాపుల వైపు పరుగులు తీస్తున్నారు.
ఇటీవల బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు డబుల్ లేదా త్రిబుల్ స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మార్పులతో గోల్డ్ ప్రియులు ఒక్కోసారి ఉత్సాహానికి లోనవుతుంటే, మరికొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా బంగారం ధరలు పెరుగుదల దిశగానే కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000గా ఉండగా, నేడు అది రూ.350 పెరిగి రూ.1,27,350కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,38,550గా ఉండగా, నేడు రూ.380 పెరిగి రూ.1,38,930గా నమోదైంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో ఈ కీలక మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తానికి బంగారం మార్కెట్ ప్రస్తుతం స్థిరత్వం లేకుండా ఊగిసలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు ఏ దిశగా కదులుతాయన్నది చూడాల్సి ఉంది. అప్పటివరకు గోల్డ్ కొనుగోలుదారులు అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాదులో నేటి బంగారం ధర..
22 క్యారెట్ల బంగారం ధర- రూ.1,27,350 (నిన్నటి ధర రూ. 1,27, 000)
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1, 38, 930 గా(నిన్నటి ధర రూ. 1,38, 550)
విజయవాడలో నేటి బంగారం ధర.
22 క్యారెట్ల బంగారం ధర- రూ.1,27,350 (నిన్నటి ధర రూ. 1,27, 000)
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1, 38, 930 (నిన్నటి ధర రూ. 1,38, 550)
