end

Menopause:మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయా?

– గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్న ఋతువిరతి

– నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, వెన్ను నొప్పితో బాధలు

– మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న సిచువేషన్

మహిళల్లో ఏడాది పాటు పీరియడ్స్ (Periods) లేకపోవడం ‘మెనోపాజ్’ (Menopause) స్టేజ్ కు చేరినట్లు  నిర్ధారించబడుతుంది. సాధారణంగా 40-50 వయసులో ఈ పరిస్థితి సంభవించే అవకాశం ఉండగా.. ఇది ప్రతి స్త్రీపై (women) ఒక్కో విధంగా ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది.  చాలా మంది మహిళలు  హాట్ ఫ్లాషెస్, (hot flashes) చెమటలు (sweat) పట్టడం, నిద్ర పట్టడంలో ఇబ్బంది, మూడ్ స్వింగ్స్ (mood swings), చిరాకు, తుంటి నొప్పి, వెన్నునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పలు సూచనలు అందిస్తున్న నిపుణులు..  పరిస్థితి ప్రమాదకరంగా మారితే గుండె (heart) సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం

(Curry leaf: ‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)

1. పండ్లు, కూరగాయలు:

ఇవి శరీరానికి అవసరమైన విటమిన్స్, (vitamins) మినరల్స్, (minerals) యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. కాలానుగుణ కూరగాయలు, తాజా పండ్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు:

ఆకు కూరలు, బీన్స్, తృణధాన్యాలు వంటి  ఫైబర్ రిచ్ ఫుడ్ (rich food) మెరుగైన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పాల (milk) ఉత్పత్తులు, ఒమేగా -3 ఫ్యాటీ (fat) యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు పోషకాహారానికి మంచి వనరులు.

3. కొవ్వు మాంసాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు:

ఫాస్ట్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, (snacks) మాంసాహారంలో సోడియం (sodium) ఎక్కువగా ఉంటుంది. దీని వలన  ఉబ్బినట్లు( బ్లోటింగ్ ఫీలింగ్) అనిపిస్తుంది. ఈ ఆహారాలు కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిలను  ప్రభావితం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే స్పైసీ ఫుడ్  (street food)హాట్ ఫ్లాషెస్ వంటి లక్షణాలను ప్రేరేపిస్తుంది.

4. ఆల్కహాల్:

ఇక్కడ మోడరేషన్ కీలకం. రెగ్యులర్ ఆల్కహాల్ (alcohol) వినియోగం అధికమైతే రుతువిరతి లక్షణాలు, నిద్ర సమస్యలు, మానసిక (mental health) ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

5. కెఫిన్:

కెఫిన్ కిక్ వల్ల హాట్ (hot) ఫ్లాషెస్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వెచ్చని పానీయాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

చురుకుగా ఉండండి :

రెగ్యులర్ వ్యాయామం (exercise)ఎముకలను బలంగా ఉంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.  శరీరం మారినప్పుడు బరువు పెరగడం(Heavy Weight) వంటి లక్షణాలను ఎదుర్కోవచ్చు. ఇందుకోసం ఈ కింది కార్యకలాపాలను ప్రయత్నించవచ్చు.

1. కార్డియో:

ఏరోబిక్ యాక్టివిటీస్ లేదా కార్డియో (Cardio)లో.. లార్జ్ మజిల్స్ (Muscles)ఉపయోగించమని ప్రోత్సహించే కార్యకలాపాలు ఉంటాయి.  రోజుకు 10 నిమిషాల చురుకైన నడక, (walking) జాగింగ్, స్విమ్మింగ్, (swimming) రన్నింగ్ (running) సైక్లింగ్ లేదా డ్యాన్స్‌తో ప్రారంభించి.. ఇంటెన్స్ ఎక్సర్ సైజ్ వరకు వెళ్లొచ్చు.

2. స్త్రెంతెన్ ట్రైనింగ్:

డంబెల్స్‌ని ఎత్తడం లేదా వెయిట్ మెషీన్‌ (Weight machine) లను ఉపయోగించడం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.  అదే సమయంలో శరీర కొవ్వును (Cholesterol) తగ్గిస్తుంది.

3. యోగా:

యోగా ఆసనాలు, పవర్ యోగా.. (yoga) టార్గెటెడ్ సింప్టమ్ రిలీఫ్ కు (relief) సహాయపడి  శరీరం విశ్రాంతి తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలతో కూడిన యోగా.. విశ్రాంతి,  సంపూర్ణతను కూడా ఇస్తుంది.

(Belly Fat:కూర్చొని కూర్చొని పొట్ట పెరిగిపోయిందా..? )

మెంటల్ హెల్త్ :

పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల (Hormonal) మార్పుల వల్ల  మానసిక ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. ఈ దశలో ఉన్న స్త్రీలు నిద్రలేమి, ఆందోళన, కదలలేని స్థితి, అలసట, ఒత్తిడి (stress) లేదా నిరాశ వంటి లక్షణాలను ప్రదర్శించవచ్చు. అలాంటప్పుడు లైఫ్ స్టైల్ (life style) చేంజ్ చేయడం ద్వారా అనేక లక్షణాలను నియంత్రించవచ్చు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పుష్కలంగా నీరు త్రాగడం,  ప్రశాంతమైన నిద్ర కోసం రిలాక్సేషన్ (Relaxation) టెక్నిక్స్ ఇందుకు హెల్ప్ అవుతాయి.

వైద్యుడిని సంప్రదించండి :

గుడ్ హెల్త్ (Good health) మెయింటైన్ చేయడం మూలంగా మెనోపాజ్ కు చేరుకున్న మహిళల్లో  బోలు ఎముకల వ్యాధి (Bone disease), గుండె జబ్బులు వంటి అనారోగ్య రుగ్మతలను నివారించవచ్చు. అదనంగా  శరీరం యొక్క ఈస్ట్రోజెన్ లెవెల్స్ (Estrogen levels) స్థిరంగా ఉంచేందుకు,   లక్షణాలను నియంత్రించేందుకు.. వివిధ రకాల థెరపీ లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఆందోళనకరమైన లక్షణాలు కనిపిస్తే, ఎల్లప్పుడూ వైద్యుడిని  సంప్రదించడం మంచిది.

Exit mobile version