నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ట్రోలింగ్‌కు గురవుతున్న నటి.. తాజాగా స్పందించింది. ఈ మేరకు కొంతమంది మాటలు తనకు విసుగు తెప్పిస్తున్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు పదేపదే ట్రోల్(Troll)కు గురవుతున్నందుకు ఆవేదనను వ్యక్తం చేసింది. విషయానికొస్తే.. నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఆ మధ్య చేసిన ప్రకటన పెద్ద దుమారాన్ని రేపింది. ‘సౌత్ ఇండియాలో మాస్ మసాలా, ఐటెం సాంగ్స్ ఉంటాయి. కానీ రొమాంటిక్ సాంగ్స్ విషయంలో మాత్రం బాలీవుడ్(Bollywood) ది బెస్ట్ . బాలీవుడ్‌లో నా తొలి రొమాంటిక్ సాంగ్ రాబోతోంది’ అని వ్యాఖ్యలు చేసింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై రష్మిక మందన్న క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. బాలీవుడ్ రోమాంటిక్ పాటలకు(Romantic Songs) సంబంధించి ఆమె కామెంట్స్ గురించి అడిగారు. ఈ విషయమై రష్మిక మాట్లాడుతూ.. ‘ఆ రోజు నా మాటలు సగంలో ఆగిపోయాయి. నాకు ఇంకా ఏదో మాట్లాడాలని ఉంది. నా రొమాంటిక్ సాంగ్స్ చాలా సౌత్ (south) లో హిట్ అయ్యాయి. ఎలాగైనా అర్థం చేసుకుంటారని నేను చెప్పడం కొనసాగించలేదు. కానీ తర్వాత ట్రోల్ చేశారు’ అని చెప్పుకొచ్చింది.రష్మికను ఎందుకు ట్రోల్ చేస్తున్నారనే.. ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతుంది. దీనికి ఆమె సమాధానమిచ్చింది.. ‘ట్రోల్స్, విమర్శలకు నేను స్పందించలేదు. ఇది నేను ఇచ్చే గౌరవం. వాటి మీద ఏం మాట్లాడకుండా.. నేను ప్రతిదీ అంగీకరిస్తున్నాను. కెరీర్ మొదట్లో ఆ తప్పు చేశాను. అయితే, ఇప్పుడు విమర్శలను అంగీకరించలేం. అది నా కుటుంబంపై ప్రభావం చూపుతోంది’ అని రష్మిక తెలిపింది. రష్మిక మందన్న నటించిన ‘మిషన్ మజ్ను'(Mission Majnu) జనవరి 20న OTTలో విడుదలైంది. ఈ సినిమాలో రష్మిక మందన్న నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అంధురాలి పాత్రలో నటించింది.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా కూడా రష్మిక ట్రోల్స్ కు గురైంది. గోధుమ రంగు కుర్తా ధరించి, నమస్కరిస్తున్న ఫోటోను రష్మిక క్లిక్ చేసి తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. అలాగే కొన్ని భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసింది. ముందుగా కన్నడలో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి.. అనంతరం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, ఆంగ్ల భాషల్లో పండుగ శుభాకాంక్షలు చెప్పింది. కొందరు రష్మికకు తిరిగి విష్ చేయగా, మరికొందరు ఆమెను ట్రోల్ చేయడం మెుదలెట్టారు. ‘మొదట కన్నడ(Kannada)లో రాసినంత మాత్రాన నీకు కన్నడంటే ఇష్టమని చెప్పలేం. కన్నడతో అకస్మాత్తుగా ఎలా ప్రేమలో పడ్డారు? మీరు ఇంతకు ముందు చేసిన వాటిని మేం ఎప్పటికీ మరచిపోం. మేం ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా కన్నడిగులలాగే ఉంటాం. మీ ఈ నకిలీ కన్నడ ప్రేమ మాకు వద్దు. కనీసం ఇప్పుడు అయినా కన్నడ ప్రాముఖ్యత తెలుసా?’ అని ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
తన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడిందీ బ్యూటీ డాల్. అందులో భాగంగా ‘‘నిజాయతీగా చెప్పాలంటే రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. వారే నాకు అవకాశం ఇచ్చారు. నేను నా కెరీర్‌లో ఇలా ఉండటానికి కారణంగా మంచి వాళ్లతో కలిసి వర్క్ చేశాను’’ అని తెలియజేసింది రష్మిక మందన్న. రష్మిక తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో కలిసి కిరిక్ పార్టీ చిత్రంలో నటించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో అసలు వీరి పేర్లే ప్రస్తావించని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఉన్నట్లుండి తన ప్లేటు ఫిరాయించింది. ఈరోజు ఇండస్ట్రీలో ఇలా ఉండటానికి దారి చూపించింది రక్షిత్, రిషబ్ అనే చెప్పేసింది. దీనిపై నెటిజన్స్ షాకవుతున్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నావు. ఇది కరెక్ట్ కాదంటూ నెటిజన్స్ రష్మికపై ఫైర్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో రష్మిక మందన్న ఒకరు. తన సినిమా, వ్యక్తిగత జీవితం గురించిన సంగతులను అభిమానులతో పంచుకుంటారామె. కానీ, వివిధ కారణాల వల్ల సోషల్ మీడియాలో ఆమె తరచూ ట్రోలింగ్, ద్వేషానికి గురవుతోంది. వివిధ ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన ప్రకటనలు, మాటలపై వివాదం రాజుకోవడంతో ఇంటర్నెట్ లో తనను పలువురు టార్గెట్ చేశారు. ఇలా నిరంతర విమర్శలు, ట్రోలింగ్‌లను ఎదుర్కొనే పరిపక్వత తనకు వచ్చిందని రష్మిక అంటోంది. ‘నేను ఐదారేళ్లుగా పరిశ్రమలో ఉన్నా. కొన్నిసార్లు ప్రజలు మనల్ని ప్రేమించరని, మన చిత్రాలను ఆస్వాదించరని గ్రహించా. ప్రేక్షకులు నా గురించి సానుకూలంగా మాత్రమే ఆలోచిస్తారని ఆశించకూడదు’ అని తన హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్‌లోచెప్పింది.
తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ద్వేషం ప్రదర్శించినా పాజిటివ్‌గా ఉండాలని రష్మిక నిర్ణయించుకుంది. అందరినీ ఆదరిస్తూ సానుకూలంగా ఉండాలనే తన స్వభావాన్ని మార్చుకోలేనని చెప్పింది. కాగా, విజయ్ సరసన రష్మిక నటించిన తమిళ చిత్రం ‘వారిసు’ ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు‘ టైటిల్ తో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించిన ‘మిషన్ మజ్ను’ చిత్రం శుక్రవారం నేరుగా ఓటీటీలో విడుదలైంది.
(Magha Snanam:మాఘమాస స్నానంతో పుణ్యలోక ప్రాప్తి)