- సీజన్ 6 ట్రోఫీని సొంతం చేసుకున్న సింగర్
Telugu Bigg Boss session 6: తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్-6’ గ్రాండ్ ఫినాలే (Grand finale)లో సింగర్ రేవంత్ (Singer Revanth)ట్రోఫీ (Trophy)ని సొంతం చేసుకున్నాడు. అయితే హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దూకుడుతోపాటు తెలివిగా ఆడిన రేవంత్ ఎట్టకేలకు తన కలను నిజం చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎక్కువసార్లు నామినేట్ (Nomimate) అయిన కంటెస్టెంట్ విన్నర్ (winner) అవుతాడన్న సాంప్రదాయం ఉంది. కౌశల్ (Koushal), రాహుల్ (Rahul), సన్నీ (Sunny), అభిజిత్ (Abhijith)లు ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి.. విజేతలుగా అవతరించారు. రేవంత్ విషయంలోనూ అదే సాంప్రదాయం కొనసాగింది. రేవంత్ ఈ సీజన్‌లో ఏకంగా 12 వారాలు అతడు నామినేట్ అయ్యాడు. హౌస్‌లో రెండుసార్లు కెప్టెన్ అయ్యింది రేవంత్ సత్తా చాటాడు.
ఈ సీజన్ 6లో మొత్తం 21 మంది సభ్యలు పోటీ పడగా రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రోహిత్ (Revanth, Aadi Reddy, Srihan, Keerthy Bhatt, Rohit)లు ఫైనలిస్టులుగా మిగిలారు. సూపర్ ఫన్‌తో సాగిన గ్రాండ్ ఫినాలెలో మొదట రోహిత్, తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. టాప్-2లో శ్రీహాన్, రేవంత్ మిగిలారు. శ్రీహాన్ 40 లక్షల ఆఫర్‌తో బయటకు రాగా ఓటింగ్‌లో అతడే విన్నర్. ఇక ప్రైజ్ మనీలో సగం అమౌంట్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని సూచించారు హోస్ట్ నాగ్. ఫస్ట్ ఇద్దరూ నో చెప్పారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దరూ పట్టు వీడలేదు. ఆ మొత్తాన్ని రూ.40లక్షలకు పెంచారు. 40 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించాడు శ్రీహాన్. హౌస్‌మేట్స్ మెజార్టీ మెంబర్స్‌తో పాటు పేరెంట్స్ కూడా చెప్పడంతో డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఆటోమెటిక్‌గా రేవంత్ విన్నర్ అయిపోయాడు. అయితే ఆడియెన్స్ ఓటింగ్‌లో స్వల్ప మెజార్టీతో శ్రీహాన్ గెలిచాడని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.
కోపిష్ఠి, కన్నింగ్, ఫ్లిప్పర్ ఇలా ట్యాగ్స్ పడినా.. గెలివాలనే తన కసి ముందు వాటన్నింటినీ పక్కని నెట్టి విజేతగా నిలిచాడు రేవంత్. అయితే శ్రీహాన్ రూ.40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి క్విట్ కావడంతో.. రేవంత్‌ని విజేతగా ప్రకటించారు. ఈ ఇద్దరు స్నేహితులు టైటిల్ నీకు.. ప్రైజ్ మనీ నాకు అన్నట్టుగా ట్రోఫీలను పంచేసుకున్నారు. మొత్తానికి ఇద్దరికీ సమన్యాయం జరిగిందన్నమాట. ఏమో ఒకవేళ.. శ్రీహాన్ రూ.40 లక్షలకు టెంప్ట్ అవ్వకుండా ఉండి ఉంటే.. గతంలో అఖిల్‌ని పంపినట్టు చేతిలో చిప్ప పెట్టిపంపేసేవారు. శ్రీహాన్ ఒకరకంగా మంచిపనే చేసినట్టు. కానీ.. అతనికి ఖచ్చితంగా గెలుస్తాడు అని హోప్స్ పెట్టుకున్న వాళ్లని మాత్రం నిరుత్సాహ పరిచినట్టే.
(FIFA World cup:ముచ్చటగా మూడోసారి)
ఇక హౌస్ మేట్స్ చాలా మంది శ్రీహాన్ తీసుకో తప్పులేదు అనే చెప్పారు.. మెరీనా, కీర్తీ వాళ్లు తీసుకోవద్దనే చెప్పారు. ఈ లోపు 30 లక్షలు కాస్తా 40 లక్షాలకు పెంచారు నాగార్జున. దాంతో బయట వాళ్లంతా తీసుకో శ్రీహాన్ తీసుకో అంటూ అరుస్తూనే ఉాన్నారు. చివరిగా ’తీసుకోవాలో వద్దో మీరు చెప్పండి నాన్నా’ అని శ్రీహాన్ అడగటంతో.. తీసుకోమనే చెప్పారు ఆయనే. దాంతో శ్రీహాన్ ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఆటోమెటిక్‌గా రేవంత్ విన్నర్ అయిపోయాడు. ఇక శ్రీహాన్‌ని, రేవంత్‌ని తీసుకుని స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున.. ‘నా దృష్టిలో రేవంత్ అండ్ శ్రీహాన్ ఇద్దరూ విన్నర్సే.. అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేస్ గెలుచుకున్నది శ్రీహాన్ అయితే.. బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నది రేవంత్ అంటూ రేవంత్‌ని విన్నర్‌గా ప్రకటించారు.
మిగిలిన పది లక్షల విన్నర్ ఫ్రైజ్ మనీతో పాటు.. 25 లక్షల విలువ కలిగిన అపార్ట్‌మెంట్ (apartment,), అలాగే కార్(CAR), ట్రోఫీ రేవంత్‌కి దక్కాయి. అయితే చివరిగా నాగార్జున (Nagarjuna) ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే. ఓట్ల ప్రకారం రేవంత్ కంటే శ్రీహాన్ కొద్ది శాతం ముందు ఉన్నాడని.. మొదటిస్థానంలో నిలిచాడని చెప్పారు.. ఆ మాట నాగార్జున చెప్పగానే.. ఓట్ల ప్రకారం శ్రీహాన్ విన్నర్.. కానీ.. శ్రీహాన్ డబ్బు తీసుకుని డ్రాప్ అయిన కారణంగానే.. రేవంత్‌ని విన్నర్‌గా చెయ్యాల్సి వచ్చిందనేది క్లారిటీ వచ్చింది. ’ఇది చాలు సార్ నాకు ఇది చాలు..‘ అంటూ శ్రీహాన్ చాలా సంబరపడ్డాడు. కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ నిర్ణయం తీసుకుని.. ట్రోఫీ గెలిచిన రేవంత్ ఈ సీజన్ విన్నర్ అంటూ మరోసారి ప్రకటించారు నాగార్జున.
బిగ్ బాస్ తర్వాత నీ జీవితం ఎలా ఉంది సన్నీ.. అని నాగ్ అడగడంతో.. సన్నీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వైపు తిరిగి.. బిగ్ బాస్ ట్రోఫీ గెలవడం కాదు.. బిగ్ బాస్ ట్రోఫీ తర్వాత దాన్ని రెస్పెక్ట్‌ని మెయిన్‌టెన్ చేయడం చాలా ముఖ్యం మచ్చా..’ అంటూ సమాధానం ఇచ్చాడు సన్నీ. ఇక నిఖిల్‌కి ఓ టోపీ ఇచ్చి.. లోపలికి పంపించారు నాగ్. లోపల డాన్స్‌లు చేసిన తర్వాత.. ఆ టోపీ ఒకరి తలపై పెట్టి.. వారిని వెంట తీసుకుని రావాలని.. ఆ పేరు నిఖిల్‌కి సీక్రేట్‌గా తెలియజేయడంతో.. నిఖిల్ రోహిత్‌కి ఆ టోపీ పెట్టాడు. సగర్వంగా రోహిత్‌ని బయటికి తీసుకొచ్చేస్తాడు నిఖిల్. రోహిత్‌ని స్టేజ్ మీదకు తీసుకొచ్చిన నిఖిల్.. డిసెంబర్ 23న రాబోతున్న తన ‘ఎయిటీన్ పేజెస్‘ తప్పకుండా చూడాలని కోరి బై చెప్పి వెళ్లాడు. తర్వాత.. నాగార్జున.. రోహిత్‌తో మాట్లాడారు. ‘రోహిత్ నువ్వు ఒక మంచి మనిషి అనిపించుకుని వెళ్తున్నావ్..’ అంటూ పొగిడారు. ఇక రోహిత్.. మామ్ డాడ్.. సారీ అని చెప్పగానే.. ‘సారీ ఎందుకు బేటా.. నువ్వు విన్నర్ అయినట్లే.. సారీ అవసరమే లేదు’ అంటూ రోహిత్ తల్లిదండ్రులు ఆనందంగా కొడుకు విజయాన్ని ఆస్వాదించారు.