end
=
Tuesday, July 15, 2025
వార్తలుజాతీయంసుందర తార.. సరోజాదేవి ఇకలేరు !
- Advertisment -

సుందర తార.. సరోజాదేవి ఇకలేరు !

- Advertisment -
- Advertisment -

చిరునవ్వులు చిందిస్తూ, చిలిపి చూపులతో అలరించిన అలనాటి తార (Veteran Actress) సరోజాదేవి (87) (Saroja Devi) ఇకలేరు. సౌందర్యానికి పర్యాయపదమైన ఆమె రూపం, ముద్దుగా పలికే మాటలు అప్పటి సినీ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసేవి. కన్నడనాట పుట్టిన (Born and brought up) ఆమె ఒక్క తన భాషలోనే కాక తెలుగు, తమిళ, హిందీ సినీ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశారు.

కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు (Bengalore City)లోని తన నివాసంలో అపస్మారక స్థితికి చేరింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. చిన్న వయసులోనే నాటకరంగం (Came from Theater) నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన సరోజాదేవి, 1955లో ‘మహాకవి కాళిదాస’ ద్వారా కన్నడ తెరపై కనిపించారు.

ఆ తర్వాత తెలుగు మొదలుకుని తమిళం, హిందీ సినిమాల్లోనూ మెరిశారు. తెలుగులో ‘పాండురంగ మహత్యం’లో ఎన్టీఆర్ సరసన కనువిందు చేసి, మహాకవి కాళిదాసు, భూకైలాస్, జగదేకవీరుని కథ, శకుంతల, ఉమాచండీ గౌరీశంకరుల కథ వంటి అద్భుత చిత్రాలతో మెప్పించారు. తన తండ్రి ప్రోత్సాహంతో రంగస్థలంలో నాటకాలు చేసి సినీమండలిలోకి అడుగుపెట్టిన సరోజాదేవి, తమిళ పరిశ్రమలో ‘కన్నడత్తు పాయింగళి’గా,

బాలీవుడ్‌లో ‘మద్రాస్ కా సుందర్ తార’గా వెలుగొందారు. 1969లో ఆమెను పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ వరించింది. ఎన్టీఆర్ జాతీయ అవార్డు, జీవితసాఫల్య పురస్కారాలు కూడా ఆమె కీర్తి కిరీటంలో కలిశాయి. తన సినీ జీవితం మొత్తంలో అంతా ఒక్క గాసిప్‌కీ తావివ్వకుండా, తనదైన మార్గంలో పయనిస్తూ అభినయ సరస్వతిగా నిలిచిన సరోజాదేవి మరణం సినీ లోకానికి తీరని లోటు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -