- పర్యాటకులపై కాల్పులు
- 30 మంది పర్యాటకులు మృతి
- 25 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్(Jammu and kashmir)లో ఉగ్రవాదులు(Terrorists) రెచ్చిపోయారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాం (Indian army uniform)ధరించి పర్యాటకులను చుట్టు ముట్టారు. ఒక్కొక్కరి ఐడీ కార్డులను పరిశీలించి వారు హిందువులైతే వెంటనే కాల్చి చంపారు. కాల్పుల్లో (Gun firing)సుమారు 30 మంది మృతిచెందారు. 25 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగిన ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవాలి. బైసరన్ మైదానం పహల్గాం హిల్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడి ఈ ప్రాంతంలోనే జరిగింది.
దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దాడికి పాల్పడిన సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘ద రెసిస్టన్స్ ఫ్రంట్’ అని తెలిసింది.
ప్రధాని మోదీ ఆరా..
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి ఆరా తీశారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని అమిత్‌షాకు సూచించారు. దీంతో అమిత్ షా జమ్మూ చేరుకుని ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం: రాష్ట్రపతి
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతిని కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘పర్యాటకులపై జరిగిన దాడి ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది ఒక అమానవీయ చర్య. దీన్ని తప్పకుండా ఖండించాలి. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.