end
=
Monday, October 13, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంతిరుమల వెంకటేశ్వరుని అలంకారంలోనే కాదు లడ్డు ప్రసాదాల్లోను పచ్చ కర్పూరాన్ని వాడుతారు..
- Advertisment -

తిరుమల వెంకటేశ్వరుని అలంకారంలోనే కాదు లడ్డు ప్రసాదాల్లోను పచ్చ కర్పూరాన్ని వాడుతారు..

- Advertisment -
- Advertisment -

Pacha Karpuram : మన సంస్కృతి, సాంప్రదాయాల( Culture and traditions) వెనుక ఎప్పుడూ ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది.ఆ సత్యాన్ని రేపటి తరానికి తెలియజేయడం మన బాధ్యత. ఇలా చేయడం ద్వారా మన సనాతన ధర్మం కాపాడపడుతుంది. ఇప్పుడు పచ్చ కర్పూరం(Pacha Karpuram) వెనుక ఉన్న ఆ శాస్త్రీయ రహస్యం తెలుసుకుందాం.

పచ్చ కర్పూరాన్ని సంస్కృతంలో హిమ కర్పూర అంటారు. హిమాలయ పర్వతాలలో ఉండే వృక్షాల ద్వారా పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు. పచ్చ కర్పూరం పచ్చగా ఉండదు. తెల్లగా, చిన్న, చిన్న బిల్లలుగా ఉంటుంది. నిలువకాలం పెరిగిన తర్వాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. ప్యూర్ పచ్చ కర్పూరం ఆవిరైనప్పుడు ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయం అవుతుంది. అదే స్వచ్ఛతకు గుర్తు. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఔషధ యోగమైనవి ఇందులో పచ్చ కర్పూరం శ్రేష్టమైనది, శక్తికలది. మూడుసార్లు బట్టి పెట్టి కాల్చి తయారుచేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైనది. దీన్ని మనం తినే పదార్థాలతో, దేవుడు పూజ గదిలో ఉంచుకుంటే ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందొచ్చు.

దేవుడి గదిలో పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు….

ప్రతిరోజు దేవుడి ముందు ఉంచే పచ్చ కర్పూరం ఉంచడం వలన గాలి పవిత్రం అవుతుంది. చలికాలం, వానకాలం. గాలి తేమలో మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి. పచ్చ కర్పూరం ఆవిరై గాల్లో కలిసి. గాలిని శుభ్రం చేస్తుంది దీని వలన శ్వాస వ్యవస్థ మరియు ఊపిరితిత్తులు, శక్తివంతమై అనారోగ్య సమస్యలు తొలుగుతాయి.

తినే పదార్థాలలో ఉపయోగించే విధానం కలిగే లాభాలు…..

1.జస్ట్ 1,2 లవంగాలు అంత పచ్చ కర్పూరాన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తే.. నోటి నుంచి వచ్చే వాసన పారిపోతుంది. సిగరెట్స్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్లు ఇలా చేస్తే ఆ…. అలవాట్లు మానే సామర్థ్యం వస్తుంది.

2.జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గుతుంది. అలాగే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

3.రోగనిరోధిక శక్తి, కండరాలలో నరాల్లో ఉత్తేజం కలుగుతాయి. అందుకే దేవాలయాలు ఇచ్చే ప్రసాదాల్లో పచ్చ కర్పూరం కలుపుతారు.

4.తిరుమల వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదాల్లోనే కాదు… ఆయన అలంకారంలో కూడా పచ్చ కర్పూరాన్ని వాడుతారు. ఇంట్లో తయారు చేసే స్వీట్స్ , లడ్డూలలో, కిచిడీ లాంటి వాటిలో 1కేజీకి 3gms వరకు వేసుకోవచ్చు.

5.ఫంగల్ ఇన్ఫెక్షన్ పచ్చ కర్పూరం పసుపు కలిపి పెడితే తగ్గుతుంది. నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనెలో కలిపి రాసుకోవాలి

6.మూడు చిటికెలు గ్లాస్ పాలలో వేసుకొని తాగితే రాత్రి సమయానికి రెట్టింపు చేస్తుంది.
కిరాణం షాపుల్లో మరియు మార్కెట్లో లభించే పచ్చ కర్పూరం స్వచ్ఛమైనవి కావు…
స్వచ్ఛమైన పచ్చ కర్పూరం చాలా ఖరీదు కలిగి ఉంటాయి.
పచ్చ కర్పూరాన్ని మేము దశలు వారిగా. నియమాలు. బట్టి పెట్టి. తయారు చేయడం జరుగుతుంది….

గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
https://chat.whatsapp.com/BxxG55lUWJMC4Ppqhv1KNO?mode=ems_copy_t

ఇట్లు
మీ ఆయుర్వేద వైద్యులు
Dr. వెంకటేష్ 9392857411.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -