end
=
Thursday, November 6, 2025
వార్తలురాష్ట్రీయంనేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
- Advertisment -

నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

- Advertisment -
- Advertisment -

PM Modi ప్రధాని నరేంద్ర మోడీ నేడు (అక్టోబర్ 16) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అత్యంత పవిత్రమైన శైవక్షేత్రం శ్రీశైలాని(Srisailam)కి చేరుకొని, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనంతో పర్యటన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే రూ.13,430 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. డ్రోన్ సిటీ స్థాపనతో పాటు పలు కీలక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా ..

ఉదయం 9:50కి ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్‌కు ప్రయాణించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. ఉదయం 10:55కి శ్రీశైలం చేరుకున్న ప్రధాని, 11:15 నుండి 12:15 గంటల వరకు భక్తిశ్రద్ధలతో మల్లికార్జున స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

మధ్యాహ్నం 12:05 గంటలకు ప్రధాని శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం 12:40కి భ్రమరాంబ గెస్ట్ హౌస్‌లో కొంతకాలం విశ్రాంతి తీసుకుని, 1:40 గంటలకు హెలికాప్టర్‌లో సున్నిపెంట నుంచి కర్నూలుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:30కి కర్నూలు చేరి, విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన రూ.13 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కేంద్రం, రాష్ట్రం కలసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధానమంత్రి మోడీ, అనంతరం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు పాల్గొంటారు. సభలో మోడీ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి లక్ష్యాలను వివరించే అవకాశం ఉంది. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోడీ కర్నూలు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేస్తారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 మంది మంత్రులు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని సభకు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా 7 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా 7,500 మంది పోలీసులను మోహరించారు. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి

ప్రధాని పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లను సమీక్షించి, మంత్రులు, కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటన రాష్ట్రానికి మేలుకొల్పే ఘట్టంగా నిలవాలని సీఎం అన్నారు. ముఖ్యంగా శ్రీశైలానికి మోడీ రాకతో ఈ పవిత్ర క్షేత్రానికి మహర్దశ తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -