end
=
Wednesday, November 26, 2025
వార్తలురాష్ట్రీయంఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు: మాజీ మంత్రికి కవిత వార్నింగ్
- Advertisment -

ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు: మాజీ మంత్రికి కవిత వార్నింగ్

- Advertisment -
- Advertisment -

Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వనపర్తిలో జరిగిన జాగృతి జనంబాట కార్యక్రమం(Janambata program) సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy)పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇన్నాళ్లూ నిరంజన్ రెడ్డి తన కంటే వయసులో పెద్దవారని గౌరవం చూపానని, అయితే ఆయన వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఇక మౌనంగా ఉండబోనని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంగా హెచ్చరించారు. తనను ఉద్దేశించి “పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ” వంటి పదాలు ఉపయోగించడం అసభ్యకరమని పేర్కొన్నారు. “ఇకపై నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది” అని కవిత కఠినంగా హెచ్చరించారు. తమపై వేరేవారిని పెట్టి మాట్లాడించినా కూడా ఇన్నాళ్లూ సహనంగా ఉన్నానని, కానీ వ్యక్తిగత విమర్శలకు హద్దు ఉండాలని చెప్పారు.

జనంబాట సభ అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, నిరంజన్ రెడ్డి వ్యవహారాల్లో అవినీతి, అక్రమాల గురించి వనపర్తి ప్రజలు ఎన్నాళ్లుగానో చెబుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లో ఉన్న ఆరోపణలేనని, వాటిని తానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా కూడా నిరంజన్ రెడ్డి గురించి వస్తున్న ఫిర్యాదులే వినిపిస్తాయి అని ఆమె అన్నారు. అంతేకాక, ఉద్యమకారులను పక్కన పెట్టి, ప్రజల అనుభవాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను పదవుల్లో పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అని, ఆయనపై బీసీలు, ఉద్యమకారులు చేసిన ఫిర్యాదులు చాలా తీవ్రమైనవని పేర్కొన్నారు. ఒకసారి మంత్రి అయ్యాక మూడు ఫార్మ్‌హౌస్‌లు నిర్మించారనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయని, ఈ విషయాలు తనవికాదని, ప్రాంతీయుల మాటలేనని ఆమె వివరించారు.

నిరంజన్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కాలబెట్టిన ఘటనపై కూడా కవిత స్పందించారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసినా స్పందన లేకపోతే అది తప్పేనని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే మంచి తీర్పు ఇచ్చారని, భవిష్యత్తులో మరింత ఘోర ఓటమి ఎదురవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రశ్నించిన కవిత, నిరంజన్ రెడ్డి అవినీతి ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. హరీశ్ రావు అనుబంధం కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని తన అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి, కవిత వ్యాఖ్యలు వనపర్తి రాజకీయాలకు కొత్త వేడి తెచ్చాయి. నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఆమె చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -