end
=
Tuesday, July 1, 2025
రాజకీయంకాంగ్రెస్ సర్కార్‌కు బీసీ రిజర్వేషన్ల సవాల్
- Advertisment -

కాంగ్రెస్ సర్కార్‌కు బీసీ రిజర్వేషన్ల సవాల్

- Advertisment -
- Advertisment -

మూడు నెలల్లో ‘లోకల్’ ఎలక్షన్ హైకోర్టు తీర్పు
30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాల్సి ఉంది..
ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కావాల్సిందే అంటున్న బీసీ సంఘాలు

మూడు నెల (Three Months of Time)ల్లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ (Wards Bifurcation Process) పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు (High Court Order) వెలువరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telagnana Govt)తోపాటు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న

కాంగ్రెస్‌ప్రభుత్వానికి ఎన్నికలు పెద్ద సవాల్‌గా పరిణమించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి పార్టీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పార్టీ పెద్దలు ప్రకటించారు. పార్టీ ఆ హామీకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అని నామకరణం చేసింది. గత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై రెండు రకాల బిల్లులు చేసి అసెంబ్లీలో అమోదం సాధించింది.

ఆ బిల్లులను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదానికి పంపించగా, ఆయన కూడా ఆమోదించి.. వాటిని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆ రెండు బిల్లులు ఉన్నాయి. వాటికి ఆమోదం వస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కుదరదు. మరోవైపు హైకోర్టు మాత్రం మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏడాదిన్నరగా పడకేసిన పాలన..
గతేడాది జనవరి 31తో రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ఏడాదిన్నర నుంచి పలెల్లో సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. వారి అసలు విధుల కారుణంగా వారికి గ్రామాల్లో పాలన గురించి పట్టించుకునే సమయం లేకపోయింది. దీంతో గ్రామాల్లో పాలన పడకేసింది. మరోవైపు ప్రత్యేక అధికారుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని పలువురు మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వడంతో పలువురు సర్పంచ్‌లు సొంత నిధులు వెచ్చించారు. ఆ విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ, ఆ తర్వాత బిల్లులు రాలేదు. దీంతో రాష్ట్రంలో వెంటనే ఎన్నికలైనా నిర్వహించాలని, లేదా తమకే పాలన బాధ్యతలు అప్పగించాలని సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో

ప్రభుత్వం, ఈసీ పరిధిలోనే నిర్ణయాలు..
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని, పంచాయతీల్లో వార్డులు విభజించాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎలక్షన్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కానీ, కులగణన కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోయామని తెలిపింది. ఎన్నిల నిర్వహణ, వార్డుల విభజనకు నెల రోజులు గడువు కావాలని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభిస్తుందని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది.

పార్టీల్లోనూ గందరగోళం..
ప్రస్తుతం రెండు బిల్లలు కేంద్రం పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి లోకల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చి ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువులోపు కేంద్రం ఆ రెండు బిల్లుల సంగతి తేల్చకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ‘మేం బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే వాటిపై నిర్ణయం తీసుకోవాలి’ అని..

బీజేపీ కోర్టులో బాల్ వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు బీఆర్‌ఎస్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నది. రిజర్వేషన్ల అమలుపై తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పునకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది.

ఈ అంశంపై పార్టీలో చర్చిస్తాం’ అని మీడియాకు తెలిపారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అమలు ఎన్నికల్లో సాధ్యం కాకపోతే.. కనీసం పార్టీ పరంగానైనా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని తెలిసింది. ఇక్కడ మరోప్రశ్న మొదలైంది. లోకల్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు. బీఫారాలు ఇచ్చే పద్ధతి ఉండదు. మరి రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -