పాకిస్థాన్(Pakisthan) లోని కొన్ని ప్రాంతాలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), వరదలు విలయం(Floods recede) సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లోనే 154 మంది ప్రాణాలు కోల్పోగా(154 People Died), పలువురు గల్లంతయ్యారు. వందల మంది గాయాలతో (Hundreds of Civilions Injured)బాధపడుతున్నారని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరద ఉధృతికి అనేక భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. పీవోకేలోని గిల్గిత్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గిజర్ జిల్లాలో ఆకస్మిక వరదల వల్ల ఎనిమిది మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. కారకోరం, బాల్టిస్తాన్ రహదారులు సైతం పలు చోట్ల కొట్టుకుపోయాయి. ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో మొత్తం 325 మంది మరణించారు, వీరిలో 142 మంది చిన్నారులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోందని అధికారులు తెలిపారు.
- Advertisment -
పాక్ ఆక్రమిత కాశ్మీర్.. అల్లకల్లోలం
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -