end
=
Wednesday, July 30, 2025
సినీమా‘గరివిడి లక్ష్మి’ ప్రయాణం
- Advertisment -

‘గరివిడి లక్ష్మి’ ప్రయాణం

- Advertisment -
- Advertisment -

‘ప్రేక్షకులకు ముఖ్య ఇజ్ఞప్తి.. మన గరివిడి లక్ష్మి పోగ్రానికి బయల్దేరిందట. మరి ఆలస్యం సెయ్యకుండా రేపందరొచ్చియండి.. మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే’ అంటూ యూట్యూబ్​లో విడుదలైన ‘గరివిడి లక్ష్మి’ (Garividi Laxmi) టీజర్​ (Teaser) ట్రెండింగ్​ (On trending)లో ఉంది. ప్రచార చిత్రాలకు ఉత్తరాంధ్ర యాసను జోడించి విడుదల చేయడంతో వాటికి క్రేజ్​ పెరుగుతోంది.

1990లో ప్రాంతంలో ఉత్తరాంధ్ర జానపద (Folklore Film) సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన జానపద కళాకారిణి (Burra katha Artist)గా గరివిడి లక్ష్మి పేరు మార్మోగేది. ఆమె ఒక బుర్రకథ కళాకారిణి. ఆమె జీవిత విశేషాలను కేంద్రంగా తీసుకుని గౌరీ నాయుడు జమ్ము ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నరేశ్ వీకే, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, ‘కంచరపాలెం’ కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు

కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నటి ఆనందిని ‘గరివిడిలక్ష్మి’ పాత్రను పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం చరణ్ అర్జున్, సినిమాటోగ్రఫీ జే ఆదిత్య అందిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -