end
=
Wednesday, October 29, 2025
వార్తలుజాతీయంలొంగిపోయిన మావోయిస్టులకు తీవ్ర హెచ్చరికలు..24న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు
- Advertisment -

లొంగిపోయిన మావోయిస్టులకు తీవ్ర హెచ్చరికలు..24న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు

- Advertisment -
- Advertisment -

Maoists: ఇటీవల సామాన్య జీవనంలోకి అడుగుపెట్టిన మాజీ మావోయిస్టు (Former Maoist)నేతలు మల్లోజుల వేణుగోపాల్ మరియు ఆశన్నలపై మావోయిస్టు పార్టీ (Maoist Party)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరూ విప్లవోద్యమాన్ని తాకట్టు పెట్టి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ, వారికి క్షమా అవకాశమే లేదని స్పష్టం చేస్తూ తీవ్ర శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ సందర్భంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై అమరుల సాక్షిగా శిక్ష తీసుకుంటామని స్పష్టంగా ప్రకటిస్తున్నాం. వీరి చర్యలు పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిగా తీవ్రంగా పరిగణిస్తున్నాం అని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలు “ఆపరేషన్ కగార్” రూపంలో ప్రారంభమయ్యాయని ఆరోపించారు.

మరోవైపు, మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మరో లేఖ వెలువడింది. ఆ లేఖలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించాయి. గిరిజనులు, రైతులు, సామాన్య ప్రజలపై అణిచివేత చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అని అభయ్ అన్నారు. ఈ పరిస్థితులను ఖండిస్తూ, అక్టోబర్ 23వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అక్టోబర్ 24న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఈ బంద్‌లో భాగస్వాములు కావాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలనే డిమాండ్‌తో ఉమ్మడి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమవుతోంది. గత కొన్ని వారాలుగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కార్యక్రమం ద్వారా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై తీవ్ర నిఘా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టు నేతలపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు మావోయిస్టు పార్టీ నుండి బహిరంగ హెచ్చరికలు, బంద్ పిలుపులు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయ, భద్రతా వర్గాలు ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. పూర్వ మావోయిస్టులపై జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో వారి భద్రతకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -