ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో చిట్ చాట్ (Chit Chat with Media) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నామని,
అసెంబ్లీ వేదికగా తనేమైనా సూచనలు ఇస్తే .. స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, ఆయన ఫాం హౌస్ దాటి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు (Tammidi Hatti Project) కోసం మహారాష్ట్రలో తాను పర్యటిస్తానని వెల్లడించారు. రెండున్నరేళ్లలో తెలంగాణ యువత (Telangana Youth)కు లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో అమలు చేసిన పథకాలను పక్కన పెట్టామని, ప్రచారం చేస్తున్నారని.. అది నిజం కాదని సీఎం స్పష్టం చేశారు. బతుకమ్మ చీరెల పంపిణీ, కేసీఆర్ కిట్ తప్ప మిగిలిన పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని తేల్చిచెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనకు లేఖలు రాయడం కాదని.. డెవలప్‌మెంట్, సంక్షేమంపై పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని కోరారు.
నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధానించాలనే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను కేటీఆర్ అడుగుతున్నారని, అందుకు కేసీఆర్ అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు. ఆ కుటుంబానికి సొంత వివాదాలతోనే సరిపోతోందని, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నాయకత్వాన్ని తన సోదరి, ఎమ్మెల్సీ కవిత ఒప్పుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.