end
=
Monday, November 3, 2025
వార్తలుఅంతర్జాతీయంచైనాకు మేం కూడా ముప్పే: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Advertisment -

చైనాకు మేం కూడా ముప్పే: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

Donald Trump: చైనా(China)తో వాణిజ్య సంబంధాల(Trade relations) ను మెరుగుపరచాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కూడా చైనాకు ముప్పేనని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఇరు దేశాల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని, ఒకరినొకరు నిరంతరం గమనిస్తూనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు చైనా అమెరికా పవర్ గ్రిడ్, నీటి సరఫరా వ్యవస్థల్లోకి చొరబడుతోందని, అలాగే మేధో సంపత్తి దోపిడీలో కూడా పాల్గొంటోందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..మేము కూడా వాళ్లకు ముప్పుగా ఉన్నాం.

మీరు చైనా చేస్తున్నారని చెప్పే చాలా పనులు మేమూ వాళ్లపై చేస్తుంటాం. ఇది పోటీ ప్రపంచం ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య పోటీ అయితే మరింత తీవ్రమైంది. మేము వాళ్లను గమనిస్తాం, వాళ్లు మమ్మల్ని గమనిస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే చైనాతో ఘర్షణ పడటం కంటే సహకారమే రెండు దేశాలకు బలం చేకూరుస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా అణ్వాయుధ సామర్థ్యం గురించి మాట్లాడుతూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వేగంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని, రాబోయే ఐదేళ్లలో అమెరికా, రష్యా సరసన నిలిచే అవకాశముందని ఆయన అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు మా వద్ద ఉన్నాయి. రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా ప్రస్తుతం వెనుకబడి ఉన్నా, వచ్చే ఐదేళ్లలో సమాన స్థాయికి వస్తుంది. వాళ్లు ఆ రంగంలో వేగంగా ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. అలాగే, తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లతో నిరాయుధీకరణ అంశంపై చర్చించానని వెల్లడించారు.

ఆర్థికంగా చైనాపై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొంటూనే, ‘రేర్ ఎర్త్ మినరల్స్’ (అరుదైన భూమి ఖనిజాలు) విషయంలో చైనాకు తమపై ప్రాధాన్యం ఉందని అంగీకరించారు. గత 25-30 ఏళ్లుగా చైనా ఈ ఖనిజాలను సేకరించి వాటిని తమ శక్తిగా మార్చుకుంది. ఇవి కంప్యూటర్ల నుంచి ఆయుధాల తయారీ వరకు కీలకమైనవి. చైనా వాటిని మాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోంది. అదే విధంగా మేమూ ఇతర సాంకేతిక అంశాలను వారికి వ్యతిరేకంగా వినియోగించాం అని వివరించారు. ఇక, ఆరు సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో జరిగిన 32వ అపెక్ ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా, చైనా నేతలు ముఖాముఖీగా కలుసుకోవడం ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -