end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌KISS:58 గంటల ముద్దు
- Advertisment -

KISS:58 గంటల ముద్దు

- Advertisment -
- Advertisment -

  • వరల్డ్ రికార్డ్ సృష్టించిన 70ఏళ్ల వృద్ధ జంట


సాధారణంగా జంటల మధ్య పరస్పర సంబంధం ఒక కిస్‌ (Kiss)తో మొదలవుతుంది. అంతేకాదు ఒక కిస్‌తో ఎన్నో కేలరీల శక్తి (energy of calories)ని పొందవచ్చని కూడా కొందరు నిపుణులు (Experts) చెప్పడం విన్నాం. మరి శరీరానికి శక్తినిచ్చే (Energy) కిస్‌తో ఆనందించే సమయం మాత్రం రెండుమూడు నిమిషాలే. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అంతగా కాదంటే మరో రెండు నిమిషాలు మాత్రమే. అంతకుమించి ఎక్కువ సమయం ముద్దుని ఆశ్వాదించి ఉండటం ఎవరివల్ల కాదు. కానీ, థాయ్‌లాండ్‌ (Thailand)కు చెందిన ఓ వృద్ధ జంట సుమారు రెండున్నర రోజులపాటు కిస్ చేసుకొని ప్రపంచ రికార్డును (World Record) బద్దలుకొట్టారు. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం.

వాలెంటైన్స్‌ డే (Valentine’s Day) సందర్భంగా థాయ్‌లాండ్‌లోని పట్టాయా (Pattaya, Thailand)లో నిర్వహించిన ముద్దుల పోటీలో (kissing contest) సుమారు తొమ్మిది జంటలు (Nine couples) పాల్గొన్నారు. అందులో 70 ఏళ్ల వయస్సులో ఉన్న ఎక్కాచై తిరనారత్, లక్సానా తిరానారత్ (Ekkachai Thiranarath, Laksana Thiranarath)జంట కూడా ఉంది. కాగా ఈ పోటీలో మిగతా వారంతా రెండుమూడు నిమిషాలకే అలసిపోగా ఈ వృద్ధ జంట మాత్రం సుమారు 58గంటల 35నిమిషాల 58సెకన్లు కిస్ చేసుకుని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సమయం ముద్దు పెట్టుకున్న జంటగా రికార్డు నెలకొల్పి నెటిజన్ల నుంచి ప్రంశంసలు అందుకుంటున్నారు.

(Sex:ప్రపంచాన్ని మర్చిపోయే ఆ మధుర క్షణాలు…)

రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ (Ripley’s Believe It or Not) ద్వారా నిర్వహించిన ఈ పోటీ నియమాల ప్రకారం ఈవెంట్‌లో పాల్గొన్న జంటలు కిస్ చేసుకున్న సమయంలో ఒకరినొకరు విడిపోకుండా ఉండేందుకు ఒకరి పాదాలపై ఒకరు కాళ్ళు పెట్టి ఉంచాలి. అయితే ఇలా చేసిన సమయంలో కిస్ చేసుకుంటూ టాయిలెట్‌ (Toilet)లకు కూడా వెళ్లినట్లు రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వైస్ ప్రెసిడెంట్ (Ripley’s Believe It or Not Vice President) వివరించారు. కాగా ‘ఈ వృద్ధ జంట రెండున్నర రోజులు నిద్రపోనందున వారు చాలా అలసిపోయారు. వారు అన్ని సమయాల్లో నిలబడవలసి వచ్చింది. కాబట్టి వారు చాలా బలహీనంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా రెండున్నర రోజులపాటు కిస్ చేయడమనేది చిన్న విషయమేమి కాదు. అందువల్ల ఈ వయస్సులో వీరి స్టామినాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ (Guinness World Record for Stamina)తో పాటు.. రెండు డైమండ్ రింగ్‌ (Diamond ring)లు, లక్షరూపాయలు నగదు బహుమతిని కూడా గెలుచుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -