end
=
Wednesday, May 15, 2024
వార్తలుజాతీయం74వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు
- Advertisment -

74వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు

- Advertisment -
- Advertisment -

74th Republic Day : ప్రతి యేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గణతంత్రవేడుకలు ఈ సారి మరింత ఘనంగా జరుగనున్నాయి. ఈ 74వ రిపబ్లిక్ డే వేడుకలను పూర్తిగా ఆధునీకరించిన సెంట్రల్ విస్టా ఎవెన్యూలో జరుగుతున్నాయి. అంతేకాదు ఉత్సవాలను వీక్షించాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం 32 వేల టికెట్లను ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టడం విశేషం. కాగా ఈ సరికొత్త పద్ధతిని దేశ భక్తులు ఆనందంగా స్వీకరిస్తున్నారు.

  • ఈ 74th Republic Day ఉత్సవాల్లో 21 గన్ సేల్యూట్ కోసం సంప్రదాయంగా వాడే 25-pounder guns స్థానంలో దేశీయంగా తయారైన 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ (105 mm Indian field guns) ను తొలిసారి వినియోగిస్తున్నారు.
  • ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ 74th Republic Day ఉత్సవాల్లో ఎంబీటీ అర్జున్, బీఎంపీ 2, నాగ్ మిస్సైల్ సిస్టమ్ వంటి పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తున్నారు.
  • ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రముఖులకు పంపే అధికారిక ఆహ్వానాలను ఈ సంవత్సరం తొలిసారి ఆన్ లైన్‌లో పంపించారు.
  • కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ నుంచి ‘డేర్ డెవిల్స్’ మోటార్ సైకిల్ రైడర్స్ టీమ్ తొలిసారి ఈ పెరేడ్ లో పాల్గొంటున్నారు. ఈ టీమ్ కు ఒక మహిళ సహ నేతృత్వం వహిస్తోంది.
  • బీఎస్ఎఫ్ కేమల్ కాంటిజెంట్ (BSF Camel Contingent) లో తొలిసారి మహిళలు పాల్గొంటున్నారు.
  • వైమానిక ప్రదర్శనలో 9 రఫేల్ యుద్ధ విమానాలు (Rafale aircraft), నౌకదళానికి చెందిన ఐఎల్ 38 (IL-38) పాల్గొంటున్నాయి. ఐఎల్ 38 (IL-38) రిపబ్లిక్ డే పరేడ్ (74th Republic Day parade) లో పాల్గొనడం ఇదే తొలిసారి.
  • అలాగే, ఇదే చివరి సారి కూడా కానుంది. ఇవి భారత నౌకాదళానికి గత 42 ఏళ్లుగా సేవలను అందిస్తున్నాయి.
  • రిపబ్లిక్ డే పరేడ్ (74th Republic Day parade) లో 144 సభ్యుల ఈజిప్ట్ సైనిక దళం కూడా పాల్గొంటోంది. 74వ గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసిని భారత్ ఆహ్వనించిన విషయం తెలిసిందే.

కాగా కర్తవ్యపథ్‍లో జరగనున్న పరేడ్‍ సమయం, లైవ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘనంగా జరుపుకునేందుకు దేశం మొత్తం సిద్ధమైంది. రేపు (జనవరి 26, గురువారం) రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కర్తవ్యపథ్ (రాజ్‍పథ్)లో పరేడ్ సాగనుంది. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu).. జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ సహా మరిన్ని వివరాలు ఇవే.

రేపు (జనవరి 26) ఉదయం 7.30 గంటలకు కర్తవ్యపథ్‍లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన ఉంటుంది.  ఉదయం 10 గంటలకు కర్తవ్యపథ్‍లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం అవుతుంది. ముందుగా భారత రక్షణ త్రివిధ దళాలు – ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ (India’s three armed forces – Army, Navy, Air Force) కవాతు ఉంటుంది. ఆయా రెజిమెంట్లకు చెందిన బ్యాండ్స్, జవాన్లు కవాతు నిర్వహిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ (Army, Navy, Air Force) బలగాల విన్యాసాలు ఉంటాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాల ప్రదర్శన జరుగుతుంది. ప్రభుత్వ టీవీ ఛానళ్లు దూరదర్శన్ (Doordarshan), సన్‍సద్ టీవీ (Sansad TV)లో రిపబ్లిక్ డే వేడుకలు పూర్తిగా లైవ్ టెలికాస్ట్ అవుతాయి. న్యూస్ ఛానెల్స్ కూడా ఈ పరేడ్‍ను లైవ్ ఇస్తాయి. రేడియోలోనూ లైవ్ టెలికాస్ట్ వినవచ్చు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‍లో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల శకటాలు (Andhra Pradesh, Assam, Tamil Nadu, West Bengal, Uttar Pradesh, Tripura, Gujarat, Arunachal Pradesh, Kerala, Maharashtra, Tamil Nadu, Karnataka, Haryana, Uttarakhand, Jharkhand) ఎంపికయ్యాయి. నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు కూడా పరేడ్‍లో రానున్నాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ (India Gate from Rashtrapati Bhavan) వరకు ఈ మార్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాదే రాజ్‍పథ్‍ పేరును కర్తవ్యపథ్‍గా మార్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -