మాచో స్టార్(Macho Star) గోపీచంద్(Actor Gopichand) ప్రస్తుతం తన కొత్త చిత్రం #గోపీచంద్33(33th Movie) చిత్రంలో నటిస్తున్నారు. ఘాజీ, ఐబీ 71, అంతరిక్షం వంటి చిత్రాలు తీసి విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Director Sankalp Reddy)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీడియాడిక్, హిస్టారికల్ ఎపిక్ గా చిత్రం రూపుదిద్దుకుంటున్నది.
గురువారం గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ అద్భుతమైన పోస్టర్, గ్లింప్స్ విడుదల చేశారు. ప్రేక్షకులను షాక్ చేసేలా గోపీచంద్ లుక్ ఉంది. పొడవాటి జుట్టు, శరీరంపై అక్కడకక్కడా గాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన గోపిచంద్ ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసింది. మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శ్రేణుల నడుమ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటకు వస్తాడు. ప్రేమగా గుర్రాన్ని నిమిరే సీన్ హృద్యంగా ఉంది. సన్నివేశం వెనుక “ధీర ధీర” అంటూ వచ్చిన బీజీఎం హైలైట్‌గా నిలిచింది. కథకు బేస్ 7వ శతాబ్దం నాటిదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ చిత్రం రూపొందిస్తున్నారని సమాచారం. చిత్ర బృందం త్వరలోనే సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నది.