end
=
Wednesday, June 18, 2025
సినీమా‘మెగా’ సెట్స్‌లోకి లేడి సూపర్​స్టార్​
- Advertisment -

‘మెగా’ సెట్స్‌లోకి లేడి సూపర్​స్టార్​

- Advertisment -
- Advertisment -

మెగాస్టార్​ చిరంజీవి (Mega star Chiranjeevi) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వంలో ‘మెగా157’ (Mega 157 title) టైటిల్​తో చిత్రం శరవేగంగా షూటింగ్ ​(Fastest Shooting Going) జరుపుకొంటున్నది. షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిత్రంలో చిరంజీవి సరసన కథానాయికగా లేడి సూపర్​స్టార్​ నయనతార నటించనున్నారు. మంగళవారం ఆమె షూటింగ్‌లో పాలుపంచుకున్నారు. చిరంజీవి వింటేజ్ అవతార్‌లో, డబుల్​ యాక్షన్​లో కనిపించనున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్​ ఇప్పటికే ప్రకటించారు.

ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్​ గా సమీర్‌రెడ్డిగా పనిచేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -