end
=
Sunday, August 31, 2025
సినీమా'బార్డర్ 2'లోకి మేధా రానా !
- Advertisment -

‘బార్డర్ 2’లోకి మేధా రానా !

- Advertisment -
- Advertisment -

బ్లాక్‌బస్టర్ హిట్ (Block Blaster) ‘బార్డర్’ సినిమా (Boarder Movie)కు సీక్వెల్‌గా వస్తున్న ‘బార్డర్ 2′(Boarder-2 Movie)లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్(Hero Varun Dhavan) సరసన మేధా రానా (Actress Medha Rana) కథానాయికగా నటించనున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం(Director Anurag Singh) వహిస్తున్నారు. వరుణ్ ధావన్ సరసన మేధా రానా నటిస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. “ప్రతి కథా తన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

‘బార్డర్ 2’లో వరుణ్ ధావన్ సరసన మేధా రానా నటించనుంది. మా టీమ్‌లోకి ఆమె స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు మేధా రానా సంతోషం వ్యక్తం చేస్తూ, “హిట్ సీక్వెల్‌లో నన్ను భాగం చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలని ఎప్పుడూ హద్దులు పెట్టుకోలేదు. కొన్ని పాత్రలకే నన్ను పరిమితం చేసుకోవడం నాకిష్టం లేదు. నాకు నేను ఎలాంటి నిబంధనలూ పెట్టుకోలేదు. ప్రతి దాన్నీ ఆస్వాదించాలనుకుంటున్నా.

అది నెగెటివ్ పాత్ర అయినా, పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం అయినా నటించాలని నిర్ణయించుకున్నా. ఏ పాత్రనైనా చేయగల కళాకారిణిగా పేరు సంపాదించుకోవాలనుకుంటున్నా” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -