end
=
Wednesday, August 13, 2025
సినీమాఈడీ ఏ ప్రశ్నలు అడిగిందంటే?
- Advertisment -

ఈడీ ఏ ప్రశ్నలు అడిగిందంటే?

- Advertisment -
- Advertisment -

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ (Online Betting App) ప్రమోషన్ వ్యవహారం (Promotion Issue)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(Enforcement Directorate) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో టాలీవుడ్ నటుడు(Tollywood Star Rana Daggubati) దగ్గుబాటి రానా కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఈడీ అధికారులు ఆయన్ను దాదాపు మూడు గంటల పాటు విచారించారు. ‘జంగిల్ రమ్మీ’ అనే గేమింగ్ యాప్ (Gaming App) ప్రమోషన్‌కు పారితోషికం ఎంత ? ఎంత కాలం కాంట్రాక్ట్ ? ఆ ఒప్పందంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? అది ఫీజు రూపంలో ఇచ్చారా లేక కమీషన్ రూపంలో ఇచ్చారా ? చెల్లింపులు ఎలా అందాయి? బ్యాంకు ఖాతాలో జమ చేశారా లేక బిట్‌కాయిన్‌ల వంటి ఇతర రూపాల్లో చెల్లించారా?

ఇది గేమింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా? ఒప్పందం చేసుకొనే ముందు యాప్‌కు ఉన్న చట్టపరమైన అనుమతులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల గురించి విచారించారా? అనే ప్రశ్నలు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలిసింది. వాస్తవానికి జూన్ 23నే రానా విచారణకు హాజరుకావాల్సి ఉన్నా, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా రాలేకపోయారు. దీంతో అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయగా, ఆయన తాజాగా విచారణకు హాజరయ్యారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -