Viral Video: ఇటీవల సెలబ్రిటీల(Celebrities) కార్యక్రమాల్లో భద్రత(Safety) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు హీరోయిన్ నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal)కు లులు మాల్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా పాట విడుదల సందర్భంగా ఎదురైన అసౌకర్యం వార్తల్లో నిలవగా, ఇప్పుడు అదే తరహా అనుభవం స్టార్ హీరోయిన్ సమంతకు(star heroine Samantha) ఎదురైంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ షోరూమ్ ఓపెనింగ్ సమయంలో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో సిరిమల్లె శారీస్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ సందడి చేశారు. ప్రారంభోత్సవం పూర్తయ్యే వరకు అంతా ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ, కార్యక్రమం ముగిసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
షోరూమ్ నుంచి బయటకు వచ్చి తన కారువైపు వెళ్లుతున్న సమంతను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమె వైపు దూసుకొచ్చారు. దగ్గర నుంచి చూడాలని, సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఆమెను చుట్టుముట్టారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. జనసందోహం ఎక్కువ కావడంతో సమంతకు కారువరకు చేరుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అభిమానులను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ, సమంతను రక్షణ వలయంలోకి తీసుకున్నారు. కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొనగా, చివరకు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ప్రయత్నాల తర్వాత సమంతను అభిమానుల గుంపు మధ్య నుంచి బయటకు తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానమంటే హద్దులు తెలుసుకోవాలని, సెలబ్రిటీల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. మరికొందరు నిర్వాహకులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, అభిమానుల ప్రేమతోనే సెలబ్రిటీలు నిలబడతారన్నది నిజమే అయినా, ఆ ప్రేమ హద్దులు దాటితే ఇలాంటి చేదు అనుభవాలకు దారితీస్తుందన్న విషయం ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg
— Cineholic (@Cineholic_india) December 21, 2025
