end
=
Monday, December 22, 2025
వార్తలురాష్ట్రీయంమహాలక్ష్మీ పథకంలో కీలక మార్పు: జీరో టికెట్‌కు గుడ్‌బై.. పాస్ కార్డుకు గ్రీన్ సిగ్నల్
- Advertisment -

మహాలక్ష్మీ పథకంలో కీలక మార్పు: జీరో టికెట్‌కు గుడ్‌బై.. పాస్ కార్డుకు గ్రీన్ సిగ్నల్

- Advertisment -
- Advertisment -

Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) మహిళలకు జీరో టికెట్(Zero ticket for women) విధానం అమల్లో ఉండగా, ఇకపై ఉచిత బస్ పాస్ కార్డులు(Bus pass cards) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగుపడనుందని భావిస్తున్నారు. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్షా సమావేశంలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతోనే ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. మహాలక్ష్మీ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచిత ప్రయాణం కోసం పెద్ద ఎత్తున మహిళలు బస్సులను ఆశ్రయించడంతో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ప్రతి ప్రయాణికురాలికి జీరో టికెట్ జారీ చేయాల్సి రావడంతో కండక్టర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రద్దీ మార్గాల్లో టికెట్ల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతూ, ప్రయాణికులు కూడా అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలకు పరిష్కారంగా జీరో టికెట్ విధానానికి బదులుగా ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలన్న డిమాండ్‌ను జేఏసీ ముందుకు తెచ్చింది.

జేఏసీ తమ డిమాండ్‌ను ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మే 6న రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మహిళలకు ఉచిత బస్ పాస్ కార్డుల జారీపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ వెల్లడించింది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మహిళలకు ఉచిత బస్ పాస్ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం అమలులోకి వస్తే, కండక్టర్ల పనిభారం తగ్గడమే కాకుండా ప్రయాణికులకు కూడా సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్పుతో మహాలక్ష్మీ పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని ఆర్టీసీ జేఏసీ ఆశాభావం వ్యక్తం చేసింది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -