end
=
Monday, April 29, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంHemagenics:ఒక్క డోస్‌ రూ.28 కోట్లు
- Advertisment -

Hemagenics:ఒక్క డోస్‌ రూ.28 కోట్లు

- Advertisment -
- Advertisment -

  • వరల్డ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ డ్రగ్‌గా ‘హెమ్జెనిక్స్’


అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration of the United States) (FDA) ప్రపంచలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ (most expensive medicine in the world) ను ఆమోదించింది. ‘హెమ్జెనిక్స్’ (‘Hemagenics’) గా పిలువబడుతున్న ఈ ఔషధం ఒక్క డోస్ విలువ (Dose value ) ఏకంగా రూ.28కోట్ల 58లక్షలు కాగా.. ‘హిమోఫిలియా B’ ట్రీట్మెంట్‌తో (‘hemophilia B’ treatment) బాధపడుతున్న రోగులను ట్రీట్ (Treat) చేస్తుంది.

హిమోఫిలియా వ్యాధి అంటే ఏమిటి?
హిమోఫిలియా (Hemophilia) అనేది జన్యుపరమైన వ్యాధి (Genetic disease). ఇందులో అనేక రకాల వ్యాధులుండగా ‘హిమోఫిలియా B’ చాలా అరుదు. రక్తంలో ప్రోటీన్ లోపం (Deficiency of protein in the blood) ఉన్న వ్యక్తికి ఈ డిసీజ్ సంక్రమించడం ద్వారా చిన్న గాయమైనా సరే రక్తం గడ్డకట్టకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. చివరకు ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా ఈ ప్రొటీన్‌ను ‘క్లాటింగ్ ఫ్యాక్టర్’ (Clotting factor) అని కూడా అంటారు.

ఒక్క డోస్‌తో ఉపశమనం
FDA ప్రకారం ‘Hemgenix’ ఔషధం ‘హీమోఫిలియా B’ రోగులపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఖరీదైనది కావచ్చు కానీ జీవితకాల చికిత్స కంటే తక్కువ ఖర్చుగానే పరిగణించబడుతుంది. అమెరికాలో ఒక రోగి హిమోఫిలియా చికిత్సకు దాదాపు రూ. 171 నుంచి రూ. 181 కోట్లు ఖర్చవుతుందని నిపుణుల అంచనా. కాగా ప్రస్తుతం FDA ఎన్ని మోతాదుల ఔషధం ఈ వ్యాధి నుంచి రక్షించగలదని సమాచారం ఇవ్వలేదు. కానీ కేవలం ఒక్క డోస్‌ తీసుకోవడం వలన రక్తస్రావం తగ్గి, రక్తం గడ్డకట్టడం (Reduces bleeding and blood clotting) జరుగుతుందని తెలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -