end
=
Thursday, May 16, 2024
వార్తలుఅంతర్జాతీయంRussia-Ukraine:ఉక్రెయిన్‌పై మళ్లీ బాంబుల వర్షం
- Advertisment -

Russia-Ukraine:ఉక్రెయిన్‌పై మళ్లీ బాంబుల వర్షం

- Advertisment -
- Advertisment -
  • 120 మిసైల్స్ ప్రయోగం చేసిన రష్యా

రష్యా – ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య మరోసారి బాంబుల వర్షం కురిసింది. ఇటీవల ఇరుదేశాల మధ్య చర్చలకు సిద్ధమంటూనే రష్యా మరోసారి రెచ్చిపోయింది. తాజాగా 120‌కు పైగా మిసైల్స్‌ (More than 120 missiles)తో ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో కీవ్ నగరం (City of Kiev)లో ముగ్గురు గాయపడ్డారు. అంతేకాకుండా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్, తూర్పున రెండవ నగరం ఖార్కివ్, పోలాండ్ సరిహద్దు (Kharkiv, border with Poland)లోని పశ్చిమ నగరం ఎల్వివ్‌తో సహా దేశమంతటా పేలుళ్లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ముఖ్యంగా లీవ్‌లోనూ దాడులు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గగనతలం, సముద్రం నుంచి మిసైల్స్ ప్రయోగం జరిగినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ (Air Force of Ukraine) పేర్కొంది. 120కి పైగా మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్ష సలహాదారు మైఖైలో పొడొలైక్ (Podolike in Mykhai) వెల్లడించాడు.

అయితే కొన్ని రోజుల క్రితం రష్యాకు తీవ్ర ప్రతిఘటనల తర్వాత ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. శక్తి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఖర్గీవ్ (Kharkiv) వరుసగా మిసైల్స్ ప్రయోగించినట్లు మేయర్ ఇగోర్ తెరెకోవ్ (Igor Terekhov) తెలిపారు. మౌళిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. కీవ్ నగరంలో నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. అయితే మిసైల్స్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని స్థానిక అధికారులు చెప్పారు. అంతకుముందు జెలెన్ స్కీ (Jelenski)మాట్లాడుతూ.. తమ సహోద్యోగులకు మద్దతు ఇవ్వాలని, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాలని ఉక్రేనియన్లను కోరారు. విషాదకరమైన సమయంలో కూడా మానవత్వాన్ని కోల్పోలేదని చెప్పారు. అంతకుముందు కూడా రష్యా ఒకే రోజు 60కి పైగా మిసైల్స్‌తో ఉక్రెయిన్‌పై విరుచుకపడిన సంగతి తెలిసిందే. కాగా ఒకవైపు చర్చలంటూనే బయట ప్రపంచానికి చెబుతున్న పుతిన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం విశేషం.

(Aircraft Engineer:ఎయిర్ ఇండియాలో ఇంజనీర్ ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -