end
=
Wednesday, May 15, 2024
వార్తలుజాతీయంRatan Tata:మరో ట్రస్ట్‌ స్థాపించిన రతన్ టాటా
- Advertisment -

Ratan Tata:మరో ట్రస్ట్‌ స్థాపించిన రతన్ టాటా

- Advertisment -
- Advertisment -

ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా(Ratan Tata) మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆయన మరికొంత మందికి బాసటగా నిలిచేందుకు మరో ట్రస్ట్‌ను ప్రారంభించారు. ప్రపంచ వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి అత్యున్నత మైన వ్యక్తులు అరుదుగా ఉంటారు. లివింగ్ లెజెండ్‌(Living Legend)గా పిలవబడే ఆయన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపార విస్తరణలో యుక్తి ఆయన సొంతం. జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడే ఆయన ఇప్పుడు తనకు సామజిక సేవ, ఆపన్నుల పట్ల ఉన్న ప్రేమని మరో సారి ప్రపంచానికి వెల్లడించారు.

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్(Chairman of Tata Trusts) రతన్ టాటా మరో వ్యక్తిగత ఎండోమెంట్ ట్రస్ట్‌ను సృష్టించారు. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ గతేడాది సెప్టెంబర్‌లో స్థాపించబడింది. ఎస్టేట్ ప్లానింగ్ లక్ష్యంతో న్యాయ నిపుణులు ఆధ్వర్యంలో నడవనుంది.. ఈ ఫౌండేషన్ కు డైరెక్టర్‌లుగా రాఘవన్ రామచంద్ర శాస్త్రి, బుర్జిస్ షాపూర్ లు నియమించబడ్డారు.కార్పస్ నుండి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్ లో స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడం కోసం ఉపయోగించే విధంగా ఎస్టేట్ ప్లానింగ్‌(Estate Planing) స్థాపించబడింది. రతన్ టాటా దాతృత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ రెండింటినీ అందుకున్న రతన్ టాటా సెప్టెంబరులో ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ కొత్త ట్రస్టీలలో ఒకరిగా ఎంపికయ్యారు. అందరినీ సమానంగా చూసుకోవడమే చాలా మందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనికుడు రతన్ టాటా. టాటా గ్రూప్ ఛైర్మన్ నే కాదు గొప్ప సామాజిక కార్యకర్త , గొప్ప నాయకుడు నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి. వందలాది కోట్లకు అధిపతి అయినా అందరితో కలిసిపోయే తత్త్వం, ఆయన దేశ భక్తి నేటి తరానికి ఆదర్శం.

85 ఏళ్లు నిండిన టాటా నికర ఆస్తుల విలువ రూ. 3,500 కోట్లు. ఇంతటి భారీ సంపద ఉన్నప్పటికీ, పారిశ్రామికవేత్తగా సంపన్నుడి స్థానంలో ఆయనకు చోటు దక్కలేదు. దీనికి కారణం టాటా ట్రస్ట్‌ల ద్వారా ఆయన చేస్తున్న భారీ విరాళాలు, దాతృత్వ కార్యక్రమాలే అని తెలుస్తోంది. టాటా సన్స్ సంస్థ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 66 శాతం ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం, కళలు, సంస్కృతి సహా అనేక సామజిక కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. అనేక ట్రస్ట్‌లను నిర్వహిస్తున్నారు. ఎండోమెంట్ ఫండ్స్(Endowment Founds) సాధారణంగా కొన్ని రకాల ధార్మిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఆదాయాన్ని సంపాదించడానికి సృష్టించబడతాయి. వీటిల్లో కొన్ని స్వచ్ఛంద ప్రయోజనాల కోసం దాతలు పెట్టుబడి పెట్టబడతాయి.. తర్వాత ట్రస్టులుగా స్థాపించబడ్డాయి. ఎండోమెంట్ ఫండ్ లబ్ధిదారుడు ఎటువంటి లాభాపేక్ష లేని వ్యక్తి. పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రముఖులు ఇప్పుడు తమ సంపదను దాతృత్వ కోసం వివిధ సంస్థలలోకి మళ్లిస్తున్నారు.

టాటా కుటుబం(Tata Family) యొక్క మొదటి వ్యక్తిగత సంస్థ టాటా స్టీల్. రతన్ టాటా ప్రారంభంలో ఒక సాధారణ ఉద్యోగిగా ఈ సంస్థలోకి 1961 లో అడుగుపెట్టాడు. ఆ తరువాత 1991 నాటికి సంస్థకు మంచి పేరుని తీసుకువచ్చాడు. టాటా గ్రూపులకు అప్పట్లో ఛైర్మెన్ గా వ్యవహరించిన జె.ఆర్.డి టాటా తన పదవీ విరమణ అనంతరం టాటా సంస్థలకు రతన్ టాటాను ఛైర్మైన్(Chairman) గా ఎంపిక చేశారు. వీరు వాహనం రంగంలో ఎదిగిన తీరు గురించి తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు. టాటా గ్రూప్ సంస్థలను అభివృద్ది చేసే భాగంలో రతన్ టాటా గారు టాటా నుండి మొదటి ప్యాసింజర్ కారును రూపొందించి 1998 లో టాటా ఇండికా అనే పేరుతో మార్కెట్లో(Market)కి విడుదల చేశారు. విడుదల చేసిన అనతి కాలంలోనే టాటా ఇండికా అత్యధికంగా అమ్మకాలు నమోదు చేసుకుని రెండు సంవత్సరాల దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది.

భారత దేశంలో ఇప్పటికి కూడా వాహన యోగానికి నోచుకులేక పోతున్నారు. కారణం ఎన్నో కుటుంబాలు ఆర్థిక పరంగా వెనకబడి ఉండటం మరియు కార్ల ధరలు ఎక్కువగా ఉండటం. దీని స్వతంగా ప్రయాణం అనేది అందరికి కళగానే ఉండేది. అందుకోసం రతన్ టాటా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టాటా నానో(TATA NANO) కారును రూపొందించాలని అనుకున్నాడు. తరువాత దీనిని కేవలం లక్ష రుపాయలకే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చవవైక కారుగా రికార్డును కూడా సృష్టించింది. రతన్ టాటా గారు తీసుకుంటున్న వ్యాపార నిర్ణయాలు జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి సంస్థల కూడా స్వాగతించాయి. ఆ తరువాత రతన్ టాటా జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి సంస్థలలో 2008లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు ఇతని నిర్ణయాల పుణ్యమా అని ఈ రెండు దిగ్గజ సంస్థలు అంతర్జాతీయ వాహనం రంగంలో విపరీతమైన అమ్మకాలు సాధిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న వారిలో రతన్ టాటా ముఖ్య పాత్ర(Important Role) పోషించారు. ప్రస్తుతం టాటా వారి సంస్థలలో దాదాపుగా 33,000 మంది ప్రజలకు ఉపాధి లభించింది. దీనికి కారణం రతన్ టాటా గారు తీసుకునే అసాధారణమైన వ్యాపార నిర్ణయాలు అని చెప్పవచ్చు.గత పది సంవత్సరాలుగా టాటా మోటార్స్ వారు కార్ల తయారీలో ఎన్నో నూతన మార్పులు ఆవిష్కరణలు జరిగాయి. కార్ల యొక్క ఇంజన్‌ల కోసం ఇతర సంస్థల మీద ఆధారపడకుండా ఇండస్ట్రీ స్వతంత్రంగా ఇంజన్‌లను తయారు చేసుకుంది. అయితే ఈ తరుణంలో రతన్ టాటా గారు ఎన్నో సార్లు రహస్య పర్యటనలు కూడా చేశారని అప్పట్లో కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి.

(MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక)

రతన్ టాటా గారు తన 75 సంవత్సరాల వయస్సులో టాటా గ్రూప్ ఛైర్మెన్ నుండి వైదొలగారు. ఆ తరువాత టాటా గ్రుపు సంస్థలకు గౌరవ ఛైర్మెన్ గా సైరస్ మిస్త్రీ ఎంపి కావడం జరిగింది. రతన్ టాటా ఛైర్మెన్ పదవి నుండి వైదొలగిన తరువాత కాలక్షేపం కోసం ఎన్నో స్టార్టప్ సంస్థలలో పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలకు తన వంతు సహాయం కల్పించి వాటిని లాభాల బాటలో నడిపించడం మొదలు పెట్టాడు. ఇందులో బాగంగా ఆంపియర్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలో కూడా రతన్ గారు పెట్టుబడులు పెట్టారు. అంతే కాకుండా చాలా రకాలల టెక్నాలజీ సంస్థలకు ఈయన నాయకత్వం వహిస్తూ, నూతనంగా కంపెనీలను స్థాపించే వారికి వెన్నుగా నిలుస్తున్నారు.

2013 లో జరిగన జెనీవా మోటార్ షో ని రతన్ టాటా సందర్శించాడు. అప్పడు ఫెరారి కార్ల సంస్థ లుకా డి కార్డియో(Luca di Cardio) ను కలుసుకున్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఫెరారి వారు ప్రదర్శించిన కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ చూడటానికి ఎంతో అందంగా ఉందన్నారు. ఇది అధ్భుతమైన డిజైన్‌ను పోలి ఉందని తెలిపాడు. అప్పుడు మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు అన లుకాడి తెలపగా, సారీ నా దగ్గర డబ్బులేదని హాస్యాస్పదం చేశారు.టాటా వారి యస్‌యువి సుమో గ్రాండ్ దాదాపుగా 380 యూనిట్లు కావాలని పాకిస్తాన్(Pakistan) ప్రభుత్వం టాటా మోటార్స్ వారిని సంప్రదించగా. రతన్ టాటా ఈ డీల్‌ను తిరస్కరించాడు. ఒక సారి ఇలాగే పాకిస్తాన్‌కు వాహనాలు సరఫరా చేయగా చాలా వరకు టాటా వాహనాలను అక్కడ రీకాల్ గా గుర్తించినట్లు గుర్తు చేశారు. ఈ కారణంగా తరువాత పాక్ కు వాహన సరఫరా నిలిపివేశారు.

టాటా మోటార్స్‌ను దేశ వ్యాప్తంగా అతి పెద్ద వాహన రంగ సంస్థగా నిలపడంలో రతన్ టాటా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చాడు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో టాటా వారి బస్సులు, వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, కార్లు, యస్‌యువిలు, వ్యానులు వంటి విసృత శ్రేణి వాహనాలను అందిస్తోంది. టాటా మోటార్స్ నుండి ఇన్ని రకాల ఉత్పత్తులు విడుగదల అవ్వడానికి రతన్ టాటా గారు ముఖ్యకారకులు అని చెప్పవచ్చు. రతన్ టాటా గారి విజయ ప్రస్థానంలో మన దేశం నుండి మరియు అంతర్జాతీయంగా చాలా అవార్డులు(Many Awards) ఇతనిని వరించాయి. మన దేశంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డులను 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ మరియు 2008 పద్మ విభూషణ్ అవార్డులు ఇతని వరించాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -