end
=
Monday, April 29, 2024
వార్తలుఅంతర్జాతీయంAustralia :హిందూ దేవాలయాలపై దాడి
- Advertisment -

Australia :హిందూ దేవాలయాలపై దాడి

- Advertisment -
- Advertisment -
  • ఆస్ట్రేలియాలో వ్యతిరేక శక్తుల దారుణం

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల (Hindu temples)పై దాడి (Attack)జరిగింది. మూడు గుళ్లను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ విషయంపై స్పందించిన భారత్ (India govt)తీవ్రంగా ఖండించింది. వాటి గోడలపై భారత్ వ్యతిరేక రాతలున్నాయి. దీంతో ఇందులో ఉగ్రవాదుల (Terrorists) హస్తమున్నట్టు అనుమానం కలుగుతోంది. జనవరి ఆరంభంలో మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ టెంపుల్, విక్టోరియాలోని కార్రమ్ డౌన్స్‌లో శ్రీ శివ విష్ణు టెంపుల్, మెల్‌బోర్న్‌లోని ఇస్కాన్ టెంపుల్ (Swaminarayan Temple in Melbourne, Sri Shiva Vishnu Temple in Carrum Downs, Victoria, ISKCON Temple in Melbourne) సమాజ వ్యతిరేక శక్తుల ఆగ్రహానికి బలయ్యాయి.

(Mohammad shami:యాబై వేలు కాదు.. పది లక్షలు కావాలి)

అయితే మళ్లీ మళ్లీ ఇష్టం వచ్చినట్టు జరుగుతున్న ఈ విధ్వంసాలు మనలను హెచ్చరిస్తున్నాయి. ‘దేవాలయాల గోడలపై ఉన్న రాతలను చూస్తే భారత వ్యతిరేక శక్తులే దీన్ని చేసి ఉంటాయన్న అనుమానం కలుగుతోంది’ అని కాన్‌బెర్రాలోని ఇండియన్ హై కమిషన్ (Indian High Commission in Canberra) ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి పనులను చూస్తుంటే శాంతియుతంగా, నమ్మకంతో, ఒకరి సంస్కృతి సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా (India, Australia) సంబంధాలను చెడగొట్టాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ పేర్కొంది. ‘ప్రొ-ఖలిస్తాన్ (Pro-Khalistan) తమ కార్యకలాపాలను ఆస్ట్రేలియాలో ప్రారంభించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన సిఖ్స్ ఫర్ జస్టీస్ (Sikhs for Justice) (ఎస్ఎఫ్‌జె)తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల సభ్యులు ఇటువంటి చర్యలకు సహాయపడుతున్నాయి. ‘ఇలాంటి పనులకు పాల్పడే వారిని న్యాయస్థానంలో నిలబెట్టడమే కాకుండా… ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు కూడా తీసుకుంటాం’ అని భారత హై కమిషన్ (Indian High Commission) స్పష్టం చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -