end
=
Wednesday, July 30, 2025
సినీమా‘కిల్లర్’​ పోస్టర్​ అదుర్స్​ !
- Advertisment -

‘కిల్లర్’​ పోస్టర్​ అదుర్స్​ !

- Advertisment -
- Advertisment -

విలక్షణ నటుడు (Versatile Actor), దర్శకుడు (Director) ఏజే సూర్య (SJ Surya) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కిల్లర్​’(Killer Movie). పదేళ్ల విరామం తర్వాత ఆయన మెగాఫోన్​ పడుతున్నారు. పాన్​ ఇండియన్​ చిత్రం (Pan Indian Film)గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. శ్రీ గొకులం మూవీస్, ఎస్‌జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నిర్మాతలుగా వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల షూటింగ్​ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. మేకర్స్ విడుదల చేసిన రెండు పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఓ పోస్టర్‌లో ఎస్‌జే సూర్య నల్ల కోటు ధరించి షాట్ గన్ పట్టుకుని స్టులిష్‌గా కనిపించారు. మరో పోస్టర్‌లో ఎస్‌జే సూర్య చేతిలో గన్ పట్టుకుని తన భుజాన రెడ్‌డ్రెస్‌లో ఉన్న ప్రీతి అస్రానిని ఎత్తుకున్న లుక్ ఆకర్షణీయంగా ఉంది.

ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాను మేకర్స్ ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -