- రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో దగ్దమైన క్రికెటర్ కారు
- తృటిలో ప్రాణాలు దక్కించుకున్న యంగ్ ప్లేయర్
Rishabh Pant: భారత క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ (Rishabh Pant Indian cricketer)కు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. తృటిలో యంగ్ ప్లేయర్ ప్రాణాపాయంనుంచి బతికి బయటపడ్డాడు. వివారాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి ( Uttarakhand to Delhi)తిరిగి వస్తుండగా అతని కారు (car) అదుపుతప్పంది. ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్ సరిహద్దు (Narsan border in Roorkee)లో ఈ ఘటన జరగగా ప్రమాదంలో అతని కారులో మంటలు (fire)చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది. రిషబ్ పంత్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు.
అయితే పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో (After hitting the railing)మంటలు చెలరేగగానే.. అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని దగ్గర్లోని రూర్కీ సివిల్ హస్పిటల్ (Roorkee Civil Hospital)కు తీసుకెళ్లారు. ఇక అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి (Delhi) తరలించారు. అయితే ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ నుదుటిపైన, కాలికి గాయాలైనట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ (Hospital Chairman Dr Sushil Nagar) తెలిపారు. అలాగే ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందన్న ఆయన ప్లాస్టిక్ సర్జరీ (Plastic surgery) ఢిల్లీలోనే చేస్తారని స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ జట్టు (Indian cricket team) లో ఇప్పుడిప్పుడే స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న రిషబ్‌కు ఈ కారు ప్రమాదం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, రీఎంట్రీ (Re entry) ఇవ్వడానికి ఏడాదికి పైగా పడుతుందని అంచనా వేస్తున్నారు పలువురు నిపుణులు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ (Accident) తర్వాత కారు పరిస్థితి చూస్తే, ప్రమాద తీవ్రత అర్థమవుతుందని, కనీస ఆనవాళ్లు కూడా తెలియకుండా 70 శాతానికి పైగా కాలి బూడిదవడం దారుణంగా పేర్కొంటూ రిషబ్ ఆరోగ్యంపై సానూకూలంగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
అలాగే కారు బలంగా డివైడర్‌ని ఢీకొట్టడంతో తల, వెన్నెముక, కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలు (The head, spine and legs were seriously injured after hitting the divider) తగిలాయి. ఈ గాయల నుంచి పూర్తిగా కోలుకుని, మళ్లీ క్రికెట్ ఆడడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రిషబ్ పంత్ కోలుకోవడానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఇదే జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్‌తో (IPL) పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ (ODI World Cup 2023 Tournament)లోనూ రిషబ్ పంత్ ఆడడం జరగదు. వన్డేల్లో మ్యాచ్ విన్నర్‌గా మారిన రిషబ్ పంత్ లేని లోటు టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh)తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ (Test series)లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో (Sri Lanka) సిరీస్‌కు పంత్‌ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో (Dhoni) కలిసి రిషబ్ పంత్ దుబాయ్ (Dubai)లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కి ముందే రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సాహిస్తూ వచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ధోనీతో పోల్చి చూడడంతో కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్న రిషబ్ ఆస్ట్రేలియా (Australia) టూర్ 2020-21 తర్వాత టీమిండియాకి ఆపద్భాంధవుడిలా మారిపోయాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గబ్బా (Gabba)టెస్టుని గెలిపించిన రిషబ్ పంత్, ఈ ఏడాది టెస్టులు, వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. సౌతాఫ్రికాలో (South africa)కేప్‌టౌన్ (cape town)లో సెంచరీ చేసిన రిషబ్ పంత్, బంగ్లాదేశ్ టూర్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాకి విజయాలు అందించాడు. కాగా ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఇక ఈ ప్రమాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag)త్వరగా కోలుకోవాలని కోరాడు. అలాగే, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ (laxman)ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. అదృష్టం కొద్దీ అతడు ప్రాణ ప్రమాదం నుంచి బయటపడ్డాడు’ అని మద్ధతుగా నిలిచాడు.