end
=
Thursday, May 16, 2024
వార్తలుజాతీయంHiraben Modi:ప్రధాని తల్లికి ప్రముఖుల సంతాపం
- Advertisment -

Hiraben Modi:ప్రధాని తల్లికి ప్రముఖుల సంతాపం

- Advertisment -
- Advertisment -

భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ మోదీ (Heeraben Modi ) మృతిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా (Social media)వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం ఆ మాతృమూర్తిపట్ల కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. అందులో కొంతమంది ఇలా తమ సానూభూతి ప్రకటించారు.

రాహుల్ గాంధీ (Rahul gandhi):
‘ప్రధాని నరేంద్ర మోడీ తల్లి శ్రీమతి హీరాబెన్ మృతి వార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, ప్రేమను తెలియజేస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు.

గవర్నర్ తమిళిసై: (Telangana Governor Tamilisai)
తెలంగాణ గవర్నర్ తమిళిసై మాతృమూర్తిగా హీరాబెన్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవితను పోస్ట్ చేశారు. ‘శైశవం నుంచే దృఢమైననాయకునిగా పెంచి ప్రజా జీవితంలో మేరు పర్వతం వంటి ఉన్నతమైన వ్యక్తిని బలమైన నాయకుణ్ణి ప్రపంచానికి అందించిన అద్వితీయమైన తల్లి శ్రీమతి హీరాబెన్ ఇక లేరు. వయసు పైబడినా పుట్టినప్పటి నుంచి.. ప్రేమ వెలుగులు పరిచిన మాతృ దీపం ఆరిపోయింది. మన ప్రధాని ప్రేమ వెల్లువ కనుమరుగైందన్న వార్త వింటే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేనినైనా తట్టుకునే శక్తిని మన ప్రధాని నరేంద్ర మోడీ జి కి ఎల్లప్పుడూ ఇచ్చే భగవంతుడు ఇప్పుడు కూడా ఈ మాతృ వియోగాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నా’ అంటూ తనదైన పద్ధతిలో నివాళి అర్పించింది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: (Indian President Draupadi Murmu)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. ‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తల్లి వంద సంవత్సరాల పోరాట జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతీక. శ్రీ మోడీ తన జీవితంలో ‘మాతృదేవోభవ’ స్ఫూర్తిని, హీరా బెన్ విలువలను నింపారు. పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

గులాం నబీ ఆజాద్ : (Ghulam Nabi Azad)
ప్రధానమంత్రి శ్రీ తల్లి శ్రీమతి హీరాబెన్ మరణవార్త విని బాధపడ్డాను. ఇలాంటి సమయాల్లో మా మాటలు @నరేంద్రమోడీకి కొంచెం ఓదార్పునిస్తాయని నాకు తెలుసు. అయితే, గౌరవనీయులైన ప్రధాన మంత్రి తల్లికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.

భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు: (President of Indian Congress Party)
హీరాబెన్ మృతిపట్ల రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. హీరాబెన్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని చెబుతూ సంతాపం తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు: (TDP Chief Chandrababu)
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు: (AP BJP chief Somu Veerraju)
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ స్పందిస్తూ.. ‘ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు ‘అమ్మ’. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మ. విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం. అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌: (Andhra Pradesh CM Jagan)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ మోదీ మృతి తననెంతో వేదనకు గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

(Narendramodi :సాధారణంగా ముగిసిన హీరాబెన్‌ అంత్యక్రియలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -