బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(BJP State chief)గా రాంచందర్‌రావు (Ramchander Rao)ను పార్టీ పెద్దలు ఏకపక్షంగా ఎన్నుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే (Gosha Mahal MLA) రాజాసింగ్ (Raja Singh) ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆ పార్టీకి రాజీనామా(Committed to resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖ సైతం సమర్పించారు.
శుక్రవారం ఆయన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం (BJP Hi Command) ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన విడుదల చేశారు. రాజాసింగ్ రాజీనామాతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకోనున్నది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఇప్పటికే ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో ఆ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. బీజేపీ బీఫారం మీద గెలిచిన రాజాసింగ్ శాసనసభ్య సభ్యత్వాన్ని అసెంబ్లీ స్పీకర్ రద్దు చేస్తేనే.. అక్కడ కూడా ఉప ఎన్నిక జరగుతుంది. లేదంటే.. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారు.
బీజేపీ నేతలు ఈ నేపథ్యంలో రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అలా ఆ పని కాకపోతే.. వారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ వెంటనే.. రాజాసింగ్‌పై వేటు వేస్తే.. గోషామహల్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక ఖాయం. అంటే.. జూబ్లీహిల్స్, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం దాదాపు ఒకేసారి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
‘జూబ్లీహిల్స్’పై ప్రధాన పార్టీల వ్యూహాలు
సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని గులాబీ అధిష్టానం ముందే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నది. నియోజకవర్గంలో ఉన్న లక్షా 25 వేలమంది ముస్లిం ఓటర్లు గెలుపు ఓటమిలో కీలక పాత్ర పోషిస్తారని గ్రహించి, స్థానిక మైనారిటీ నాయకులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. పాతబస్తీతో సంబంధాలు ఉన్న నేతలను నియోజకవర్గంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్‌ను సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసింది.
ఇప్పటికే ఎంఐఎం పార్టీతో ఆ పార్టీకి సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్‌ని కాదని, ఎంఐఎం తన అభ్యర్థిని బరిలోకి దిగితే ఓట్లు చీలే అవకాశం ఉంది. తద్వారా కాంగ్రెస్‌కు నష్టం జరగవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడోవంతు ఓట్లు ముస్లిం మైనారిటీలే. ఎంఐఎం పోటీ చేయడం వల్ల మైనారిటీ ఓట్లు చీలిపోతే లబ్ధి కాంగ్రెస్‌కి చేర్చుతుందా, లేక బీఆర్‌ఎస్‌కే కలసి వస్తుందా అన్నది చూడాలి.
ఇక భాజపా కూడా ఈ ఉపఎన్నికను వదిలేయదని తెలుస్తున్నది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీలన్నీ సవాల్‌గా తీసుకుంటున్నాయి.
‘గోషామహల్’లో ఎవరిది పైచేయి?
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో ఈ సీటు ఖాళీ అవుతున్న క్రమంలో అన్ని ప్రధాన పార్టీలకు ఉపఎన్నిక అసలైన సవాల్‌గా మారింది. ఇక్కడ ఎవరిది పైచేయి? ఏ సామాజిక వర్గం ఎటు మొగ్గుతుందో అన్నది పార్టీలకు పతాక వ్యూహాంశం. ఈ నియోజకవర్గంలో సుమారు 2.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో సుమారు 55% వరకు హిందూ ఓటర్లు. వీరిలోనూ సగానికి పైగా వాణిజ్య వర్గాలకు చెందిన మార్వాడీలు, జైన్‌లు, గుజరాతీలు. మరోవైపు ఈ స్థానంలో సుమారు 40% వరకు ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉంటారు. మిగిలిన 10శాతంలో బీసీలు, ఎస్సీలు కొంత భాగం ఉంటారు. అయితే.. ముప్పు ఏళ్లుగా గోషామహల్ అంటే.. హిందూత్వానికి మారుపేరుగా నిలుస్తున్నది. 2014 నుంచి ఇక్కడ రాజాసింగ్ అదే హిందుత్వ నినాదంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.
మరోవైపు ముస్లిం ఓట్లు ప్రధానంగా ఎంఐఎం మీదే మొగ్గే అవకాశం ఉంది. గతంలో ఎంఐఎం తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టి గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, మిగిలిన హిందూ ఓట్లు బీజేపీకి పార్టీకి చేరడం వల్ల ఎంఐఎం గెలుపు సాధించలేకపోయింది. ఈస్థానంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలహీనమనే చెప్పాలి.