end
=
Saturday, August 2, 2025
రాజకీయంక్యాబినెట్‌ సమావేశం వాయిదా
- Advertisment -

క్యాబినెట్‌ సమావేశం వాయిదా

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌లోని స‌చివాల‌యం (Secretariat)లో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన రాష్ట్ర మంత్రిమండలి (Cabinet Meeting) సమావేశం వాయిదా (Got Postponed) పడింది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ (Deputy CM Vikramarka)తో పాటు ఐదుగురు మంత్రులు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టం వ‌ల్లే శుక్ర‌వారం జ‌రుగ‌నున్న స‌మావేశం పోస్ట్‌పోన్ అయింది.

28న ఈ భేటీ నిర్వహించనున్నట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఏఐసీసీ కీల‌క భేటీల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దిల్లీలోనే ఉన్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -