end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో పెరుగుతున్న హారన్ మోతకు చెక్.. ముంబై ఫార్ములాతో కొత్త రూల్?
- Advertisment -

హైదరాబాద్‌లో పెరుగుతున్న హారన్ మోతకు చెక్.. ముంబై ఫార్ములాతో కొత్త రూల్?

- Advertisment -
- Advertisment -

Traffic: హైదరాబాద్(Hyderabad) రోడ్లపై రోజువారీ ప్రయాణం వాహనదారుల సహనానికి నిజంగా పెద్ద పరీక్షలా మారింది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎర్రదీపం పడిన క్షణం నుంచే వెనుక వాహనదారుల హారన్ల మోత(sound of horns) ఆగకుండా వినిపించడం నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఉన్మత్త హారన్ సంస్కృతి కేవలం చిరాకు పుట్టించడమే కాదు, నగరాన్ని ప్రమాదకర స్థాయిలో శబ్ద కాలుష్యం(noise pollution)లోకి నెట్టివేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అమలు చేసి మంచి ఫలితాలను తెచ్చుకున్న ‘హాంక్ మోర్… వెయిట్ మోర్’ (Honk More Wait More) (ఎక్కువ హారన్ కొడితే ఎక్కువసేపు ఆగాలి) విధానాన్ని హైదరాబాద్‌లో కూడా ప్రవేశపట్టాలనే డిమాండ్ ఇటీవల ఊపందుకుంది. ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీ ఆధారిత విధానం ప్రభావవంతమని నగరవాసులు భావిస్తున్నారు.

  

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి సమయంలో శబ్దం 55 డెసిబుల్స్‌ను మించకూడదు. అయితే, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ వంటి అత్యంత రద్దీ కూడళ్లలో ఈ పరిమితి దాదాపు రెండింతలు దాటి 110 డెసిబుల్స్‌ వరకు నమోదు కావడం ఆందోళనకరం. దీర్ఘకాలంగా ఇలాంటి శబ్ద కాలుష్యానికి గురికావడం వల్ల వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న టాప్-5 నగరాల్లో హైదరాబాద్ ఉండటమే ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ట్రాఫిక్ పోలీసులు 2020లో చేపట్టిన వినూత్న ప్రయోగం ప్రత్యేక గుర్తింపు పొందింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన సౌండ్ సెన్సర్లు హారన్ మోత పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా రెడ్ సిగ్నల్ సమయాన్ని పెంచుతాయి. హారన్ల శబ్దం తగ్గిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ పడుతుంది.

‘మోర్ హాంక్ – మోర్ వెయిట్’ అనే ఈ కాన్సెప్ట్‌ వల్ల అక్కడ హారన్ మోత 60 శాతం వరకు తగ్గడం(Honk More Wait More) విశేషం. అదే విధానాన్ని బెంగళూరులో కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ఇలాంటి ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ఈ టెక్నాలజీని అమలు చేయాలని పర్యావరణవేత్తలు, ట్రాఫిక్ నిపుణులు, నగరవాసులు కోరుతున్నారు. ఇది అమలులోకి వస్తే వాహనదారుల్లో క్రమశిక్షణ పెరగడమే కాకుండా, నగరంలోని శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమర్థవంతమైన టెక్నాలజీ, కఠినమైన అమలు, ప్రజల్లో అవగాహన ఈ మూడు కలిస్తేనే హైదరాబాద్ హారన్ మోత నుండి నిజంగా ఉపశమనం పొందగలదని స్పష్టమవుతోంది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -