end
=
Friday, August 1, 2025
సినీమాస్పెషల్ సాంగ్‌తో గుమ్మడికాయ కొట్టేశారు!
- Advertisment -

స్పెషల్ సాంగ్‌తో గుమ్మడికాయ కొట్టేశారు!

- Advertisment -
- Advertisment -

మెగాస్టార్ (Mega star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ట దర్శకత్వం(Director Vasista)లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం(Socio Fanctacy Film) ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. తాజాగా చిరంజీవి– మౌని రాయ్‌పై చిత్రీకరించిన ప్రత్యేక గీతంతో సినిమా షూటింగ్ పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య డిజైన్ చేయగా, 100 మంది డ్యాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించారు. పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, శ్యామ్ కాసర్ల లిరిక్స్ రాశారు. ఇక ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. డీవోపీ చోటా కే నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తూ, ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనుంది చిత్రబృందం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -