- కన్వీనర్ గోవర్దన్ వెల్లడి
తెలుగు రాష్ర్టాలలో ఎంసెట్ 2021 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4 నుండి జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 82, ఏపీలో 23 ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒక రోజు ముందు తమ పరీక్షాల కేంద్రాలను తెలసుకోవాలని సూచించారు. కచ్చితంగా సమయపాలన పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో నిమిషం లేటుగా వచ్చినా అనుమతి ఉండదని చెప్పారు.
ఎంసెట్ పరీక్షలను రెండు సెషన్‌లుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని కన్వీనర్ గోవర్ధన్ వివరించారు. ఇదిలావుండగా ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని చెప్పారు. కోవిడ్‌తో ఇబ్బందుల వల్ల విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలలో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రం లొకేషన్ కూడా ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్య అంశాలు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో వివరాలు నింపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.