end
=
Friday, November 1, 2024
వార్తలురాష్ట్రీయంElectric bike:ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు
- Advertisment -

Electric bike:ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు

- Advertisment -
- Advertisment -

  • వినూత్న కార్యక్రమం చెపట్టిన ఏపీ ప్రభుత్వం
  • సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు చేయూత
  • ఇప్పటికే పలు ఈ- స్కూటర్ సంస్థలతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ (Andhra Pradesh government) తమ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు (Government jobs) తీపి కబురు చెప్పింది. సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు విద్యుత్ (Electric bike)వాహనాలను అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ బైక్ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం (Agreement) కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–స్కూటర్‌’ (E- SCOOTER)లను అందించేందుకు రెడీ అవుతోంది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర (Two wheeler) వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు (Petrol) ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి (Common, middle class)వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని (Pollution)అరికట్టడమే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. అతి త్వరలోనే ఈ పథకం సాకారం కానుంది.

(Bandi sanjay:ఫ్రస్టేషన్‌తోనే బరితెగిస్తున్నారు)

అంతేగాకుండా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆప్కాబ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (Apcob, IDFC, Bank of Baroda) వంటి బ్యాంకులు ఆర్థిక సాయం (Financial assistance)చేస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఓలా, హీరో, బిగాస్, కైనటిక్, ఆథర్, టీవీఎస్ (Ola, Hero, Bigas, Kinetic, Author, TVS) వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష వాహనాలను అందించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకు అవసరమైన ఒప్పందాలను చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (Nedcap). ఈ–స్కూటర్లు అందుబాటులోకి వస్తే.. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే 3 గంటల పాటు చార్జింగ్‌ (Charging)పెడితే చాలు.. రోజంతా ఈ–స్కూటర్‌ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది.

ఛార్జింగ్‌ స్టేషన్లు అలాగే ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్ల (Charging stations)ఏర్పాటుకు కూడా నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో (RTC Bus Stands, Railway Stations, Government Offices as well as Private Places) చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ పథకం అనుకున్నట్లు సక్సెస్ అయితే పోల్యూషన్ తగ్గడంతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలకు కొద్దిపాటి ఆర్థిక కష్టాలు తప్పనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -