end
=
Thursday, May 16, 2024
క్రీడలురికీ పాంటింగ్‌కు గుండెపోటు?
- Advertisment -

రికీ పాంటింగ్‌కు గుండెపోటు?

- Advertisment -
- Advertisment -
  • తీవ్ర అవస్వస్థతో ఆసుపత్రిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

Sports :
ఆస్ట్రేలియా (Australia) బ్యాటింగ్ గ్రేట్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తీవ్ర అవస్వస్థతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ (Australia-West Indies) మధ్య పెర్త్‌ (perth)లో జరుగుతున్న తొలి టెస్టుకు ‘చానల్ 7’లో కామెంటరీ చెబుతున్న పాంటింగ్ లంచ్ (Lunch time) సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు ‘డైలీ టెలీగ్రాఫ్’ను ఉటంకిస్తూ ‘ఫాక్స్ స్పోర్ట్స్’ (Fox Sports quoting Daily Telegraph ) తెలిపింది. మ్యాచ్ మూడో రోజైన (శుక్రవారం) కొంత అస్వస్థతగా ఉండడంతో ఎందుకైనా మంచిదని గుండె చెకప్ కోసం పాంటింగ్ (Ricky Ponting) ఆసుపత్రికి వెళ్లినట్టు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ (‘Sydney Morning Herald’)పేర్కొంది.

ఈ మేరకు పాంటింగ్‌ అనారోగ్యానికి గురయ్యాడని, మ్యాచ్ మిగతా కామెంటరీకి (Commentary) అందుబాటులో ఉండడని చానల్ 7 అధికార ప్రతినిధి (A Channel 7 spokesperson) ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రాడ్ మార్ష్, షేన్ వార్న్ (Rod Marsh, Shane Warne) గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. సెప్టెంబరు 2020లో ఆసీస్ మాజీ బ్యాటర్ డీన్ జోన్స్ (Dean Jones) మరణించాడు. అలాగే, వెస్టర్న్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్, నెదర్లాండ్స్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ (Ryan Campbell) కూడా గుండెపోటుతో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

ఆస్ట్రేలియా తరపున పాంటింగ్(Ricky Ponting) 168 టెస్టుల్లో 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీల, 62 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 82 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 17 టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలతో 401 పరుగులు చేశాడు. పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా వరుసగా మూడు వన్డే ప్రపంచకప్‌లు (ODI World Cups 1999, 2003, 2007) సాధించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -