end
=
Tuesday, July 1, 2025
వార్తలురాష్ట్రీయంఇందిరమ్మ ఇంటి ఇక్కట్లు
- Advertisment -

ఇందిరమ్మ ఇంటి ఇక్కట్లు

- Advertisment -
- Advertisment -
  • రాష్ట్రవ్యాప్తంగా నీరుగారుతున్న పథకం
  • నిరుపేదలకు సవాల్​గా మారిన నిర్మాణ పనులు
  • పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్న లబ్ధదారులు
  • 600 చదరపు అడుగుల పరిమితే పెద్ద సమస్య
  • ఇప్పటివరకు సగం ఇల్లైనా ప్రారంభం కాలేదు..

‘కూడు.. గూడు.. గుడ్డ.. ప్రతి ఒక్కరి అవసరం.. ప్రతి పేదవాడు తనకు సొంతిల్లు(Own house Dream) ఉండాలనుకుంటాడు. ఎండొచ్చినా, వానొచ్చినా తన కుటుంబానికి రక్షణ కల్పించాలనుకుంటాడు. బయట అద్దెలు కట్టలేక, కొత్త ఇల్లు కట్టుకునే స్తోమత లేక సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నాడు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, నిరుపేదలకు న్యాయం చేయలేకపోతున్నది (Injustice To Poor people). ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వమైనా గూడు సమస్య తీరుస్తుందనకుంటే ఇందిరమ్మ ఇంటి పథకానికి కొరకరాని కొర్రీలు పెడుతున్నది.

ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నప్పటికీ, ఆచరణలోకి వచ్చేసరికి పథకానికి సంబంధించిన నిబంధనలు లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిర్మాణానికి పెట్టుబడి లేక నిరుపేదలు ఇంటి పనులు ప్రారంభించేందుకు సాహసం చేయడం లేదు. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు, పెట్టుబడికి ఇబ్బందులు లబ్ధిదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇల్లు 600 చదరపు అడుగులలోపే ఉండాలనే నిబంధన లబ్ధిదారులకు ఏమాత్రం నచ్చడం లేదు.

అంతచిన్న ఇంటిలో పిల్లల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎలా చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనేకానేక కారణాల వల్ల ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు జోరందుకోవటం లేదు. తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇప్పటి వరకు 50శాతం ఇళ్లు కూడా మొదలుకాలేదు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం..
ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాని (Indiramma Illu Scheme)కి శ్రీకారం చుట్టిం ది. రూ.5 లక్షల సాయం(Rs.5 Lakhs Financial assistance)తో లబ్ధిదారులకు సొంతింటిని నిర్మించుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. నాలుగు విడతల్లో హౌసింగ్ ఈఈ, డీఈ, ఏఈ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించి, యాప్లో ఇంటి పురోగతిని అప్లోడ్ చేసిన తరువాతే విడతల వారిగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది.

తొలి విడతలో లబ్ధిదారుల ఎంపికతో పాటు ప్రొసిడింగ్​ పత్రాల పంపిణీ దాదాపు పూర్తయింది. ఇక రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక చేయటంతో వారికి ప్రొసిడింగ్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలంటే చేతిలో కనీసం లక్షన్నర రుపాయలైనా ఉండాలి. ఆ మొత్తం చేతిలో ఉంటే ఎప్పుడో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకునే వాళ్లం కదా అని లబ్ధిదా రులు వాపోతున్నారు.

ఇందిరమ్మ ఇంటిని బెస్​మెంట్ వరకు నిర్మించాలంటే.. పిల్లర్ల కోసం పునాది తవ్విన వారితో పాటు మేస్త్రీ, కూలీల ఖర్చుతో పాటు ఇనుము, సిమెంట్, ఇసుక తదితర వాటికి కనీసం రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అప్పోసప్పో చేసి ఇంత పెట్టుబడి పెట్టి నప్పటికీ బిల్లులు వస్తాయో రావో అనే టెన్షన్ లబ్ధి దారుల్లో నెలకొంది.

ప్రతిబంధకంగా నిబంధనల కొర్రీలు..
ప్రభుత్వం నిబంధనల మేరకే ఇంటిని నిర్మించుకోవాల్సి ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం అందించే సాయంతో పాటు లబ్ధిదారుడు కూడా కొంత మొత్తాన్ని కలుపుకుని, తన అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం 600 చదరపు అడుగుల పరిధి లోనే ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటేనే రూ.5 లక్షల సాయం అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

దీంతో చాలామంది లబ్ధిదారులు ఆలోచనలో పడుతు న్నారు. కొద్దిగా ఆర్థికంగా ఉన్న లబ్ధిదారులైతే మళ్లీ ఇంటిని నిర్మించుకునే అవకాశాలు ఉండవని, కట్టుకునే దేదో కొంచెం విశాలంగా నిర్మించుకుంటే బాగుంటుం దనే ఆలోచనలో ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసినా, ఏదైనా ఇతర శుభకార్యం చేసిన ఇంటికి వచ్చే బంధు, మిత్రులకు చిన్న ఇంటితో ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటు కొంత మొత్తాన్ని కలుపుకుని పెద్దగా ఇంటిని నిర్మించు కోవాలని భావిస్తున్నప్పటికి ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకంగా మారుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు.

ముగ్గుపోసేందుకు వెనుకడుగు..
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు మంజూరు పత్రం తీసుకున్న 45 రోజుల్లోపు ఇంటికి కావాల్సిన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలనే నిబంధన లబ్ధి దారులను కలవర పెడుతోంది. ఇంటికి కావాల్సిన ఇసుక, సిమెంట్, స్టీల్, తలుపులు, కిటికీలు, ఇటుక తదితర సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంది. పెరిగిన నిర్మాణ వ్యయం లబ్ధిదారులపై భారంగా మారుతుంది. ముందస్తుగా ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి సాయం అందించటం లేదు.

దీంతో పెరిగిన సిమెంట్ బస్తా రూ.350 ‌_‌ రూ.450 వరకు ధరలున్నాయి. ఒక ఇటుక రూ.8 నుంచి రూ.12 వరకు నాణ్యతను బట్టి ధరలు ఉన్నాయి. స్టీల్​తో పాటు ఇతర సామగ్రిని ఒకేసారి సమకూర్చుకోవటం పేదలకు ఆర్థికంగా భారమవుతుందనే చర్చ జరుగుతోంది. 90 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉండటంతో పెట్టుబడి వ్యయం పెరిగి ఇందిరమ్మ ఇళ్లు ముందుకు సాగుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతున్నది.

వీటితో పాటు వర్షాకాలం ప్రారంభం కావటంతో ఇంటి నిర్మాణాలను ప్రారంభిం చేందుకు కూడా లబ్ధిదారులు ఆసక్తి చూపటం లేదు. నోటిసులు ఇచ్చినప్పటికీ రేపు మాపు అంటు దాటవేస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -