- పోలీస్ వాహన డ్రైవర్, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది లారీ. ఈ ఘటన శ్రీకాళహస్తి – తిరుపతి మార్గంలో సీతారాంపేట గ్రామ సమీపంలో జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ పోలీస్ పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది. దీంతో పోలీసు కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహన డ్రైవర్ కులశేఖర్, కానిస్టేబుల్ మునిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఎవరిది, ఓనర్ ఎవరు, లారీ డ్రైవర్ ఎక్కడ? అనే వివరాలు తెలియాలి.