end
=
Friday, November 1, 2024
వార్తలుజాతీయంమరోసారి పెరిగిన పాల ధర
- Advertisment -

మరోసారి పెరిగిన పాల ధర

- Advertisment -
- Advertisment -

రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారం పడనుంది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమూల్‌ పాల ధర కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా లీటర్‌ పాలపై రూ.2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ వారు తెలిపారు. దీంతో గుజరాత్‌ రాష్ట్రంతో పాటు ఢిల్లీ, బెంగాల్‌, ముంబై అన్ని రాష్ట్రాల్లో ఈ అమూల్‌ పాల ధర పెరగనుంది. ఇప్పుడు పెరిగిన ధరతో అమూల్‌ గోల్డ్‌ మిల్క్‌ ధర లీటర్‌కు రూ.31కి చేరింది. అదే అమూల్‌ టాటా రూ.25, అమూల్‌ శక్తి ధర రూ.28 చేరనుంది. పెరిగిన ధరలు ఆగస్టు 17 రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.అయితే గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ అమూల బ్రాండ్‌ పేరుతో దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తి కొనసాగుతోంది.

అమూల్‌ పాలు కొనుగోలు చేసే అన్ని రాష్ట్రాల్లో ఈ ధరను అమలు చేస్తున్నట్టు అమూల్‌ మిల్క్‌ ప్రకటించింది. పాల ఉత్పత్తిలో పెరిగిన ఖర్చు కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ రోజుకు 150 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుండగా, అందులో గుజరాత్‌ 60 లక్షలు లీటర్లు, ఢిల్లీ 35 లక్షల లీటర్లు, మహారాష్ట్ర 20 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -