end
=
Tuesday, July 1, 2025
వార్తలుజాతీయంసైబర్ నేరగాళ్లపైకి ‘ఆపరేషన్ చక్ర’
- Advertisment -

సైబర్ నేరగాళ్లపైకి ‘ఆపరేషన్ చక్ర’

- Advertisment -
- Advertisment -

ఇవాళ రేపు మనం ఎక్కడ చూసినా.. సైబర్​ నేరగాళ్ల (Cyber Criminals) గురించే వింటున్నాం.. చదువుకున్నవారు (Literates).. చదువుకోని వారు (Illiterates) అని కాకుండా, ఎవరైనా సైబర్​ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుకుంటున్నారు. జేబులు, బ్యాంకు ఖాతాలు (Bank Accounts) ఖాళీ చేసుకుంటున్నారు. ఇప్పుడు సైబర్​ నేరాలు నగరాలు, పట్టణ పరిధిలోనే వెలుగు చూసేవి. సాంకేతికత పెరిగే కొద్దీ..

ఇప్పుడవి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సైబర్​ నేరాల కట్టడికి నడుం బిగించింది. దీనిలో భాగంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) (Central Bureau Of Investigation) రంగంలోకి దింపింది. ‘ఆపరేషన్ చక్ర’ (Operation Chakra) పేరుతో ప్రత్యేక ఆపరేషన్​​ షురూ చేసింది. ఏకంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 42 ప్రదేశాల్లో గురువారం దాడులు చేయించింది.

దాడుల్లో సీబీఐ 9 మంది కరుడుగట్టిన సైబర్​ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నది. నిందితులంతా యూపీఐ డిజిటల్​ యాప్​ల ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. నిందితులు అనధికారికంగా 700 బ్యాంకుల పరిధిలో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.

గాలం ఇలా..
నిందితులు సోషల్​మీడియాలో మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడుల పేరుతో వ్యపార ప్రకటనలు ప్రచారం చేస్తారు. ఆ గాలానికి చిక్కిన వారికి మొదట్లో పెట్టిన పెట్టుబడికి లాభాలు చూపిస్తారు. ఇక తర్వాత మోసాలు ప్రారంభిస్తారు. ఆన్​లైన్​ ద్వారా తాము నిర్దేశించిన ఖాతాల్లోకి భారీగా డబ్బులు మళ్లించుంటారు. ఆ తర్వాత ముఖం చాటేస్తారు. సీబీఐ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకుంది.

అరెస్టయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరస్పాండెంట్లు కూడా ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -