end
=
Monday, April 29, 2024
వార్తలుఅంతర్జాతీయంNew Zealand:ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నా
- Advertisment -

New Zealand:ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నా

- Advertisment -
- Advertisment -

–  న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా

 న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్(Jacinda Ardern) కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యాకలాపాలను దృష్టిలో పెట్టుకుని పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన నిర్ణయాన్ని  వెల్లడించారు. వచే నెల 7లోపు ప్రధాని పదవికి రాజీనామా(Resignation) చేస్తానని చెప్పారు. దీనికి ఇదే సరైన సమయమని తెలిపారు. ‘నేను ఒక మనిషిని. మనం చేయగలిగినంత కాలం ఇస్తాం, ఆపై సమయం వచ్చింది. ఇది నా సమయం’ అని లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో అన్నారు. తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ఆమె పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన అందరినీ ఆశ్చర్యాని(Surprise)కి గురిచేసింది. 2020 తర్వాత జెసిండా పాలనపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం వైపుగా దేశం అడుగులు ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి. దేశాన్ని ముందుండి నడిపించడం అత్యంత విశిష్టమైన పని అని జెసిండా చెప్పారు. అదే సమయంలో ఇది సవాలుతో కూడుకున్నదని అన్నారు. అయితే ఆ పదవిని నిర్వహించగలమా లేదా అని తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం గృహకల్పన, వాతవరణ మార్పులు, పేదరికం వంటి అంశాల్లో తీసుకున్న చర్యలు గర్వపడేలా(To Be Proud) ఉన్నాయని చెప్పారు.

2019లో క్రిస్టిచర్చ్ మసీదులో ఉగ్రదాడిలో 51 మంది ముస్లింలు మరణించడం, 40 మందికి పైగా గాయపడడం ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయితే మరుసటి ఏడాదే ఫాటాల్ వైట్ దీవిలో అగ్నిపర్వత పేలుడు(volcanic eruption) సమయంలో తీసుకున్న చర్యలు అందరిని ఆకర్షించాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాను ప్రధాని పదవి నుంచి తప్పకున్న ఎంపీగా కొనసాగనున్నట్లు జెసిండా చెప్పారు. మరో వైపు న్యూజిలాండ్‌లో సాధారణ ఎన్నికలు అక్టోబర్ 14న జరగనున్నాయి. ఈ క్రమంలో తర్వాత ప్రధానిగా డిప్యూటీ ప్రధాని గ్రాంట్ రాబర్ట్ సన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆదివారం కొత్త ప్రధాని పేరును ప్రకటించినున్నారు.

(Nallagutta Fire Accident : సికిందరాబాద్‌ నల్లగుట్టలో భారీ అగ్ని ప్రమాదం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -