end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంWalking Benefits : వాకింగ్ వల్ల ప్రయోజనాలు
- Advertisment -

Walking Benefits : వాకింగ్ వల్ల ప్రయోజనాలు

- Advertisment -
- Advertisment -

Walking Benefits : ఈ రోజుల్లో ఎక్కువ మంది కంప్యూటర్(Computer) తో కుస్తీ పడే ఉద్యోగాలు(IT Jobs) చేస్తున్నారు. ఇలా కూర్చొని చేయడం వల్ల బరువు(Over Weight) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం నడక (Walking) అలవాటు చేసుకుంటే ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను సులభంగా అరికట్టవచ్చు. అది ఎలానో తెల్సుకుందాం. అందులోనూ వాకింగ్ ద్వారా బరువు తగ్గడం(weight loss) చాలా ఆరోగ్యకరమైన పద్ధతి. నడక సులభమైన వ్యాయామ మార్గం. ఎలాంటి శిక్షణ అవసరం లేని ఏరోబిక్ వ్యాయామం. నడక మనుషుల శరీరాన్ని ఫిట్‌గా(Body Fitness), ఆరోగ్యంగా ఉంచడం లో ఎంతో సహాయపడుతుంది. దీనికి ఖరీదైన పరికరాలు అవసరం లేదు. దినచర్యపై ఎలాంటి ప్రభావం పడకుండా నడకను ఆస్వాదించవచ్చు.

ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం వాకింగ్ ద్వారానే మనం బరువు తగ్గవచ్చు. కాకపోతే రోజూ దాదాపు గంటపాటు కచ్చితంగా నడవాలి. ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. పలు అధ్యయనాల ప్రకారం రోజూ గంట పాటూ వాకింగ్ చేస్తే(Regular Walking) వారంలోనే 3 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇలా 12 వారాల పాటూ చేస్తే 30 కిలోలు తగ్గొచ్చు అని చెబుతున్నారు.

వాకింగ్ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మెదడు(mind rejuvenation) చురుగ్గా పనిచేస్తుంది. అల్జీమర్స్ alzheimer’s, మతిమరుపు వంటి సమస్యలు రావు. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంధత్వానికి కారణమయ్యే గ్లకోమాను నిరోధిస్తుంది. అమెరికా హార్ట్ అసోసియేషన్(Amercian Heart Association) తెలిపిన ప్రకారం గుండెకు కూడా చాల మేలు. రక్తసరఫరా బాగా జరిగి గుండె పోటు(Heart Attack) వచ్చే అవకాశం తగ్గుతుంది. అధిక రక్తపోటు(Blood Pressure) ఉన్నవారికి వాకింగ్ చాలా అవసరం. బీపీ(BP Control) అదుపులో ఉంటుంది. నడక వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు. దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో మాంసాహారాన్ని తగ్గించాలి. కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉన్న ఏ ఆహారాన్ని తీసుకోకూడదు.

వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఊపుతూ నడవాలి. వేగంగా నడవాలి. మెల్లగా నడిచిన ఉపయోగం లేదు. అలాగని ప్రారంభం నుండి వేగంగా నడవకూడదు. మెల్లగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మొదటిరోజే గంట నడవడం కష్టం అనుకుంటే రెండు మూడు రోజులు అరగంట పాటూ నడిచి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళితే మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -